‘అవోపా’ ఆధ్వర్యంలో విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్‌ పంపిణీ


Wed,September 11, 2019 01:25 AM

పరకాల, నమస్తే తెలంగాణ : ఆర్యవైశ్య అఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ (అవోపా) పరకాల ఆధ్వర్యంలో పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంగళవారం పరకాల వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో బంగారు పతకాలను ప్రదానం చేశారు. అవోపా అధ్యక్షుడు మాదంశెట్టి శివకుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అవోపా గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ నాగబండి విద్యాసాగర్‌ హాజరయ్యారు. పరకాల, నడికూడ మండలాలకు చెందిన పదో తరగతిలో 10/10 జీపీఏ సాధించిన వారితోపాటు ఇంటర్మీడియట్‌లోని అన్ని గ్రూపులు, డిగ్రీ బీ ఎస్సీ ఎంపీసీ, ఎంపీసీఎస్‌, బీజెడ్‌సీ, బీకాం, బీఏ గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి గోల్డ్‌మెడల్స్‌ను బహుకరించారు. కార్యక్రమంలో అవోపా బాధ్యులు కొమురవెల్లి వెంకటేశ్వర్లు, గందె వెంకన్న, సూర్యదేవర శ్రావన్‌, ఎల్లంకి బిక్షపతి, విద్యాసాగర్‌, రాజేంద్రప్రసాద్‌, శ్రావణ్‌, సాంబమూర్తి పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...