మొక్కలకు రక్షణగా ‘హరిత దళాలు’


Wed,September 11, 2019 01:25 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్‌ 10 : పర్యావరణ పరిరక్షణ కొరవడడంతో భూతాపం పెరిగిపోతున్నది. క్రమంగా సహజ సంపద, వనరులు తగ్గిపోతున్నాయి. దీం తో అనావృష్టి, అతివృష్టిలు సంభవిస్తూ ఏదో ఒక చోట అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి. అటవీ సంపద తగ్గిపోతుండడంతో జల సంపద క్రమంగా తగ్గిపోయి ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. నాలుగేళ్లుగా వరుసగా హరితహారం చేపడుతున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి హరిత దళాలు పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలను త యారు చేసింది. నాటిన మొక్కల సంరక్షణ, ఇతర కార్యక్రమాలు చేపట్టేందుకు హరిత దళాలు (ఎన్‌జీసీ) కాలుష్య ని యంత్రణా మండలి (పీసీబీ)లు చేపట్టే కార్యక్రమాల్లో పాలుపంచుకోనున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలోని 161 పాఠశాలలో హరితదళం పేరుతో ఐదు రకాల కమిటీలను విద్యార్థుల భాగస్వామ్యంతో వేసేందుకు సిద్ధమవుతున్నది. పాఠశాలల్లో విద్యార్థులచే ఏర్పాటు కానున్న హరిదళాలను సమన్వయం చేడం కోసం హరిత ఉపాధ్యాయుడు (గ్రీన్‌ టీచర్‌)గా పాఠశాలలో పనిచేసే ఒక ఉపాధ్యాయుడికి బాధ్యత ఇవ్వనున్నారు. అలాగే హరిత దళాల నిర్వహణ, వాటి ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఉన్నత పాఠశాలకు రూ.5వేల చొప్పున నిధిని కూడా ఇటీవల మంజూరు చేసింది.

ఆసక్తి ఉన్న విద్యార్థులకు అవకాశం..
మొక్కల పెంపకం, సంరక్షణ, వాతావరణ కాలుష్యంపై అవగాహన కలిగిన విద్యార్థులకు ఎన్‌జీసీలో అవకాశం క ల్పించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో తొలుతగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు ఈ కమిటీలలో అవకాశం కల్పించనున్నారు. అంతేగాక మానవ జీవనానికి, ప్రకృతికి ఉన్న అనుబంధా న్ని నిపుణులైన అద్యాపకులు అవగాహన కల్పిస్తారు. అలా గే వాతావరణ కాలుష్యంతో జరుగుతున్న అనర్థాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించిన అనంతరం ఆసక్తి ఉన్న విద్యార్థులను కమిటీలో ఎంపిక చేయనున్నారు. తొలుతగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను కమిటీ లో వేయాల్సి ఉంటుంది. కమిటీ బాధ్యులు తమ తోటి వి ద్యార్థులకు కూడా పర్యావరణంపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో హరితదళాలు ప్రకృతిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నాయి.

హరితదళాలు చేపట్టే కార్యక్రమాలు...
పాఠశాలల్లో తొలుతగా 8వ తరగతి విద్యార్థులతో జాతీయ హరిత దళాలు సమావేశం అవుతాయి. ఎన్‌జీసీ ఆదేశాలు, లక్ష్యాలను విద్యార్థులకు వివరించడంతో పాటుగా ప్రకృతి పరిరక్షణకు దోహదపడే విధంగా విద్యార్థులతో కమిటీలను వేయాల్సి ఉంటుంది. ఇందులో పాఠశాల విద్యార్థుల సంఖ్యను బట్టి 50 మంది విద్యార్థులను ఎంపిక చేయాలి. ప్రతీ కమిటీలో 5 నుంచి 10 మంది విద్యార్థులు ఉండేలా చూస్తూ కమిటీలను ఐదు రకాలుగా విభజించాల్సి ఉంటుంది. ఇందులో

1 భూకాలుష్య నియంత్రణ (గ్రీన్‌) కమిటీ.
2 గాలి కాలుష్య నియంత్రణ(ఆరంజ్‌) కమిటీ.
3 నీటి కాలుష్య నియంత్రణ (బ్లూ) కమిటీ
4 వృథాను అరికట్టే బ్రౌన్‌) కమిటీ
5 శక్తి నిర్వహణ (ఎల్లో) కమిటీలుగా ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీల సభ్యులు వారికి ఇచ్చిన బాధ్యతను, ఎన్‌జీసీ నిబంధనలను పాటించాలి.
విద్యార్థుల భాగస్వామ్యం..
పాఠశాలల్లో ఎన్‌జీసీ ఆధ్వర్యంలో చేపట్టే ప్రతీ కమిటీలో ఉన్న విద్యార్థులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రతీ బృందంలోని ఒక విద్యార్థిని కమిటీ నాయకుడిగా నియమించాలి. పాఠశాలలో నాటిన మొక్కలను సంరక్షిస్తూ ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన పరిస్థితులను తయారు చేసేందుకు కమిటీలు కృషి చేయాల్సి ఉంటుంది.

ఇందులో ప్రధానంగా
1 కమిటీలు ప్రభుత్వం చేపడుతున్న హరితహారంపై అవగాహన పెంచుకొని మొక్కలపై ప్రేమ, అనురాగం కలిగి ఉండాలి.
-మొక్కలను దత్తత తీసుకొని మొక్కల రక్షణకు కంచెలు వేయించాలి.
-కేటాయించిన మొక్కలకు విద్యార్థులు నేమ్‌ ప్లేట్‌ను ఏర్పాటు చేసి మొక్కకు పేరు పెట్టాలి.
-వారానికి ఒకసారి మొక్కకు సేంద్రియ ఎరువు పిరిచాకి చేయాలి.
-15 రోజులకు ఒకసారి మొక్క పెరుగుదలను స్కేలుతో కొలిచి నమోదు చేయాలి.
2 గ్రామంలో గణేశ్‌ ఉత్సవాలకు మట్టి విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని ప్రచారం చేపట్టాలి. వీలైతే మట్టి విగ్రహాలను తయారు చేసి కమిటీల ఆధ్వర్యంలో పంపిణీ చేయాలి దీనివల్ల ప్రజలు, ప్రకృతికి కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి.
3 హోలీ పండుగల సందర్భంగా రసాయనాలు కలిపిన రంగులకు బదులుగా సహజ రంగులతో మాత్రమే వేడుకలు జరుపుకోవాలని ప్రజలను చైతన్య పర్చాలి. రసాయనాల వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు వివరించాలి.
4 దీపావళి పండుగ, ఇతర వేడుకల్లో బాణసంచా కాల్చడం వల్ల కలిగే అనర్ధాలపై ప్రచారాలు చేపట్టాలి.
5 ఇంకుడు గుంతలు నిర్మించడం, వాటి ప్రాముఖ్యతను తెలియజేయాలి.
6 ఎర్త్‌డే, ఓజోన్‌ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవం, నీటి దినోత్సవం, అలవీ దినోత్సవం, జీవ వైవిద్య దినోత్సవం, వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ శక్తి దినోత్సవాలలో కమిటీలు భాగస్వామ్యం కావాలి.

పాఠశాలకు ప్రత్యేక నిధులు ..
పాఠశాలల్లో హరితదళాల ఏర్పాటు, కార్యక్రమాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ పాఠశాలకు రూ.5వేల నిధులు కేటాయించింది. 2019-20 విద్యా సంవత్సరంలో ఈ నిధులను కమిటీలు వినియోగించుకోవాల్సి ఉంటుంది. పర్యావరణ హితం కోసం చేపట్టే కార్యక్రమాలను అవసరమైన పనిముట్లు, బ్యానర్‌లు, ఇతర ఖర్చుల కోసం ఈ నిధులను వినియోగించుకోవాలి. ఇందుకోసం ప్రత్యేకంగా రిజిష్టర్‌ ఏర్పాటు చేసి అందులో ఖర్చుల వివరాలను కమిటీ బాధ్యులు రాయాల్సి ఉంటుంది. అలాగే రిజిష్టర్‌లో కమిటీలు, కమిటీలలో బాధ్యులైన విద్యార్థుల పేర్లు, వారి బాధ్యతలను కూడా రాయాలి. అలాగే కమిటీలు చేపట్టే కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను కూడా రిజిష్టర్‌లో పొందుపర్చాలి. ఈ నిర్వహణ పాఠశాలలోని హరిత ఉపాధ్యాయుల ద్వారా కమిటీలు నిర్వహించాల్సి ఉంటుంది.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...