దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్ట్‌


Wed,September 11, 2019 01:24 AM

కృష్ణకాలనీ, సెప్టెంబర్‌ 10 : జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు అడిషనల్‌ ఎస్పీ రాజమహేంద్రనాయక్‌ తెలిపారు. మంగళవారం ఆయన డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ కిరణ్‌కుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలోని రేగొండ, చిట్యాల, టేకుమట్ల, గణపురం మండలాల్లోని పలు గ్రామాల్లో పది నెలలుగా దొంగతనాలకు పాల్పడుతున్న ఎమ్డీ ఖాజా, గడ్డం శ్రీకాంత్‌, ఎమ్డీ అఫ్జల్‌ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. దొంగిలించిన సొమ్మును ముగ్గురు కలిసి మోటర్‌ సైకిల్‌పై మహారాష్ట్రలోని సిరోంచలో అమ్మడానికి పోతుండగా సీసీఎస్‌ సీఐ మోహన్‌, ఎస్సై సూర్యనారాయణలకు అందిన సమాచారాన్ని చిట్యాల, గణపురం పోలీసులకు చేరవేశారు. సోమవారం సాయంత్రం గాంధీనగర్‌ క్రాస్‌ వద్ద చిట్యాల సీఐ సాయిరమణ, గణపురం ఎస్సై గోవర్ధన్‌లు తమ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు మోటర్‌ సైకిల్‌పై వెళ్తుండగా ఆపి విచారించామన్నారు. వారిని పరకాలకు చెందిన ఎమ్డీ ఖాజా, గడ్డం శ్రీకాంత్‌, వరంగల్‌ దేశాయిపేటకు చెందిన ఎమ్డీ అఫ్జల్‌గా నిర్ధారించినట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ ముగ్గురు పది నెలల నుంచి చల్లగరిగె, భాగిర్థిపేట, కుందయ్యపల్లి, కొత్తపల్లి సుబ్బక్కపల్లి, గణపురం, రంగయ్యపల్లి, మైలారం, ములుగు మండలం కమ్మరిపల్లి గ్రామాల్లో తాళం వేసి ఉన్న ఇండ్లను ఎంచుకొని తాళాలు పగులగొట్టి ఇండ్లల్లోకి ప్రవేశించి బంగారు, వెండి నగలు దొంగిలించామని ఒప్పుకున్నారని ఏఎస్పీ తెలిపారు. గత సంవత్సరం నుంచి జిల్లాలోని ఆయా గ్రామాల్లో దొంగతనాలను మొత్తం తామే చేశామని ఒప్పుకున్నారన్నారు. వారి వద్ద నుంచి రూ. 7,25,000ల విలువ గల 24 తులాల బంగారు అభరణాలు, 46 తులాల వెండి అభరణాలతో పాటు వారు దొంగిలించడానికి ఉపయోగించిన మోటర్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపనున్నట్లు తెలిపారు.

గడ్డం శ్రీకాంత్‌ గతంలో వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో అనేక దొంగతనాలు చేసి అక్కడి జిల్లా పోలీసులకు పట్టుపడ్డాడని చెప్పారు. మున్ముందు రోజుల్లో ఇలాంటి దొంగతనాలకు ఎవరైనా పాల్పడినట్లయితే వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని ఎస్పీ ఆర్‌ భాస్కరన్‌ ఆదేశించినట్లు అడిషనల్‌ ఎస్పీ రాజమహేంద్ర నాయక్‌ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో చిట్యాల సీఐ సాయిరమణ, గణపూర్‌ ఎస్సై గోవర్ధన్‌, సీసీఎస్‌ సీఐ మోహన్‌, ఏఎస్సైలు రమణారెడ్డి, గోపాల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

సెల్‌ఫోన్‌ దొంగల ముఠా అరెస్టు
వరంగల్‌ క్రైం : సెల్‌ఫోన్లను దొంగలిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను హన్మకొండ పోలీసులు అరెస్టు చేసి నిందితుల నుంచి రూ.30 లక్షల విలువ చేసే 87 సెల్‌ఫోన్లు, రెండు కార్లు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ రవీందర్‌ తెలిపారు. మంగళవారం కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. ఏపీలోని కర్నూల్‌ జిల్లా డోన్‌ గ్రామానికి చెందిన కావడి పోచయ్య, అనంతపురం జిల్లా నల్లకుంటకు చెందిన ఆకుల వడివేలు, పూసల సాయిరాం, పూసల సుబ్బారాయుడు మరో ముగ్గురు మైనర్లు ముఠాగా ఏర్పడ్డారు. నిందితుల్లో పొచయ్య చెడు అలవాట్లకు బానిసై అనంతపురం జిల్లాలో జేబు దొంగతనం, సెల్‌ఫోన్ల దొంగతనం చేసేవాడన్నారు.ఈ క్రమంలోనే మిగతా ముగ్గురు నిందితులు పరిచయం కావడంతో నలుగురు కలిసి మరో ముగ్గురు మైనర్లతో కలిసి సెల్‌ఫోన్లను చోరీ చేసేందుకు ప్రణాళిక ఏర్పరచుకున్నారన్నారు.

ఎస్సై ప్రవీణ్‌ బృందానికి చిక్కిన ముఠా..
అద్దె కార్ల ద్వారా పక్క రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చిన ముఠా హన్మకొండ ఎస్సై పెట్రోలింగ్‌ చేస్తుండగా ఐదుగురు ముఠా సభ్యులు పట్టుబడ్డారని తెలిపారు. ఇద్దరు మైనర్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారిని విచారించగా తెలంగాణ వ్యాప్తంగా 87 చోరీలు చేయగా కమిషనరేట్‌ పరిధిలో 11 చోరీలు చే సినట్లు తెలిపారన్నారు. నిందితులను గుర్తించడంలో ప్రతిభ చూపిన హన్మకొండ ఏసీపీ శ్రీధర్‌, బోనాల కిషన్‌, ఎస్సైలు ప్రవీణ్‌, కొంరెల్లి, ఏఎస్సై రాజు, క్రైం కానిస్టేబుళ్లు శివకృష్ణను సీపీ అభినందించారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...