భక్తి శ్రద్ధలతో మొహర్రం


Wed,September 11, 2019 01:23 AM

పరకాల, నమస్తే తెలంగాణ : హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా చెప్పుకునే మొహర్రం వేడుకలు పరకాల ప్రాంతంలో మంగళవారం ఘనంగా జరిగాయి. మొహర్రం ను పురస్కరించుకుని ముస్లిం ముస్లిం పోరాటవీరులను స్మరిస్తూ తొమ్మిదిరోజులపాటు ముస్లింలు మొహర్రం పండుగను జరుపుకుంటారు. ఇందులో భాగంగా గ్రామాల్లో పీరీలను ఊరేగిస్తారు.మొదటిసారి వర్షం కురుస్తుందని ముస్లింల నమ్మకం. మొహర్రం పండుగ వేడుకలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
దామెర : మండలంలోని ఊరుగొండ, సీతారంపురం, దుర్గంపేట తదితర గ్రామాల్లో ముస్లింలు మోహర్రం పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఊరుగొండలో మండల వైస్‌ ఎంపీపీ జాకీర్‌ అలీ ఆధ్వర్యంలో ముస్లింలు పీరీలను ఊరేగించారు. మహిళలు మట్కీల చుట్టు ప్రదక్షన చేస్తూ మహ్మద్‌ ప్రవక్త గీతాలను ఆలపిస్తూ పాటలు పాడగా ముస్లీం సోదరులు దూలా ఆడారు. ఈ కార్యక్రమంలో మజీద్‌ కమిటీ అధ్యక్షులు తాజోద్దీన్‌, ఎండీ ఖరీం,సర్పంచ్‌ సత్యనారాయణరెడ్డి, ఉపసర్పంచ్‌ విద్యాసాగర్‌ పాల్గొన్నారు.
సంగెం : మండలంలో మొహర్రం వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయాన్నే పుణ్యస్నానాలాచరించి పిల్లలు పెద్దలు కలిసి కొత్త బట్టలతో నమాజ్‌కు మజీద్‌లకుపూజలు చేశారు. హిందూ- ముస్లింలు ఒకరినొకరు అలయ్‌బలయ్‌తీసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
శాయంపేట : మండంలో నర్సింహుపల్లి, గంగిరేణిగూడెం తదితర గ్రామాల్లో ముస్లిం సోదరులు మొహర్రం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తొమ్మిది రోజులుగా సవార్లను కొలిచారు. కొట్టాల ముందు అగ్నిగుండంను పూడ్చి వేశారు. కర్బలాను అందజేశారు. రాత్రి వేళ నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ గోనె నాగరాజు, పోచారం ముజవరి ఎండీ సర్వర్‌మియా, ఎస్‌కే మహబూబ్‌ సుబానీ, సయ్యద్‌,ఎండీ అమ్జద్‌పాషా పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...