ప్రజాగొంతుక కాళోజీ..


Tue,September 10, 2019 02:51 AM

-నారాయణరావును స్ఫూర్తిగా తీసుకోవాలి
-ఘనంగా ప్రజాకవి జయంతి వేడుకలు
-త్వరలోనే కళాక్షేత్రం పనులు పూర్తి
-జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ వెల్లడి
-నివాళులర్పించిన కలెక్టర్ పీజే పాటిల్, అధికారులు, కవులు, రచయితలు

వరంగల్ సబర్బన్, నమస్తే తెలంగాణ : ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో తెలంగాణ వైతాళికుడు కాళోజి నారాయణ రావు 105వ జయంతి సందర్భంగా ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వెంకటేశ్వర్ రావు, నర్సింగా రావు, గణపతి, సంధ్యా రాణిలు కాళోజి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ డైరెక్టర్ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ తెలంగాణ బాషలోనే ఇక్కడి జీవన విధానం ఉందని చెప్పిన గొప్ప వ్యక్తి కాళోజి అని కొనియాడారు. కార్యక్రమంలో సీజీఎంలు కిషన్, అశోక్ కుమార్ సదర్‌లాల్, మోహన్ రావు, మధుసూదన్, ప్రభాకర్ తిరుపతి రెడ్డి,తిరుమల్ రావు పాల్గొన్నారు.

భీమదేవరపల్లిలో...
భీమదేవరపల్లి: మండల పరిషత్ కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీపీ జక్కుల అనితరమేశ్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషలో కాళోజీ ప్రావీణ్యుడు అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్, ఎంపీటీసీలు అప్పని పద్మ, మహ్మద్ అలీ, నల్ల కౌసల్య, సట్ల రఘుపతి, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.

ఎల్కతుర్తిలో...
ఎల్కతుర్తి : మండల పరిషత్ కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి ఎంపీపీ మేకల స్వప్న, ఎంపీడీఓ సునీతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పరిసత్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ శంకర్, ఈఓపీఆర్డీ జయంత్‌రెడ్డి, ఏఈ సుభాష్‌రెడ్డి, ఏవో రాజుకుమార్, ఏఈవో కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.

హసన్‌పర్తిలో..
హసన్‌పర్తి: ప్రజా కవి కాళోజీ కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం ప్రజాచైతన్యానికి ఊపిరి పోసిందని ఎంపీపీ కేతపాక సునిత అన్నారు. ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల స్పెషలాఫీసర్ దామోదర్‌రెడ్డి, ఇన్‌చార్జి ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏపీవో విజయలక్ష్మీ, ఎంపీటీసీలు రజిత, గౌరు సుమతి, సర్పంచ్ ఐలయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

ధర్మసాగర్‌లో...
ధర్మసాగర్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నాడు జరిగిన ఉద్యమంలో ప్రజల పక్షణ గళమెత్తిన ప్రజాకవి కాళోజీ అని ఎంపీపీ నిమ్మ కవిత అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో కాళోజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంపీపీ, తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మిదేవి, ఎంపీడీవో జవహర్‌రెడ్డి పూలమావేసి ఘనంగా నివాళేలర్పించారు. కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ విమల, వైస్ ఎంపీపీ బండారీ రవీందర్, ఎంపీటీసీలు జాలిగపు వనమాల, బొడ్డు శోభ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. వేలేరు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రవీందర్, జెడ్పీటీసీ చాడ సరిత కాళోజీ చిత్రపటానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని దేవునూర్‌లో సోమవారం సర్పంచ్ చిర్ర కవిత, ఎంపీటీసీ లక్క సునీత శ్రీనివాస్, ఉప సర్పంచ్ మధు, వార్డు సభ్యులు సునీత, కవిత,పాల్గొన్నారు.

ఐనవోలులో...
ఐనవోలు : మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, పాఠశాలల్లో కాళోజీ జయంతిని నిర్వహించారు. ఐనవోలు, ఒంటిమామిడిపల్లి పాఠశాలలో నిర్వహించిన వేడకల్లో ఎంపీపీ మార్నేని మధుమతి రవీందర్‌రావు హాజరై కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటరమణ, స్థానిక సర్పంచ్ జన్ను కుమారస్వామి, మండల సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఆడెపు దయాకర్, ఉప సర్పంచ్ సతీశ్‌కుమార్, రాజు, ఎంపీటీసీలు కొత్తూరి కల్పన, కడ్దూరి రాజు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,పాల్గొన్నారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...