లింగ నిర్ధారణ నిషేధం..


Tue,September 10, 2019 02:49 AM

రెడ్డికాలనీ, సెప్టెంబర్ 09: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే 104 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని డీఎంహెచ్‌వో హరీశ్‌రాజ్ సూచించారు. సోమవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో పీసీపీఎన్‌డీటీ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. గర్భిణులకు స్కానింగ్ నిర్వహించడం కేవలం సమస్యలను గుర్తించడం, పిండం ఎదుగుదల వంటి వాటి కోసమేనని, పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అని తేల్చడం నిషేధమన్నారు. ఎవరైనా లింగ నిర్ధారణ చేస్తున్నట్లు తెలిస్తే 104 నంబర్‌కు ఫోన్ చేసి చెబితే.. వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. రికార్డుల నిర్వహణ సరిగా లేని, రిపోర్టులు సమర్పించని వారిపై పీసీపీఎన్‌డీటీ నియమానుసారం చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వేలేరు, ధర్మసాగర్, కమలాపూర్ మండలాల్లో అవగాహన సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని, త్వరలోనే వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎండీ యాకుబ్‌పాషా, సభ్యులు డాక్టర్ సురేందర్‌రెడ్డి, డాక్టర్ బీ కవిత, అనితారెడ్డి, వసూధ, లీగల్ ఎక్స్‌పర్ట్ రేవతిదేవి, జిల్లా మాస్ మీడియా అధికారి వేముల అశోక్‌రెడ్డి, సందీప్, తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...