మడికొండలో ఉచిత వైద్య శిబిరం


Tue,September 10, 2019 02:49 AM

మడికొండ, సెప్టెంబర్ 09: కాళోజీ జయంతిని పురస్కరించుకుని మడికొండలోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఆల్ బ్రాహ్మణ్ అఫీషియల్, ప్రొఫెషనల్ అసోసియేషన్, భీమారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్ పాంచాలరాయ్, డాక్టర్ వేముగంటి సుశాంత్ గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంతకుముందు కాళోజీకి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మోత్కూరు మనోహర్‌రావు, జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ కోశాధికారి మధుకర్‌రావు, హెచ్‌ఎం రాజపద్మ, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి మధురిమ, సురేశ్‌రావు, చిట్టంపల్లి రవీందర్‌రావు, శ్రీకాంత్, ప్రవీణ్‌కుమార్, జవ్వాజి కిషన్ తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...