డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఆరుగురికి జైలు శిక్ష


Tue,September 10, 2019 02:48 AM

మట్టెవాడ, సెప్టెంబర్ 09: వరంగల్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురికి జైలు శిక్ష పడినట్లు వరంగల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ స్వామి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ కరీమాబాద్‌కు చెందిన కోలా రాజేశ్వర్ ఈ నెల 7న మద్యం తాగి ద్విచక్రవాహనం నడుపుతున్న క్రమంలో వరంగల్ అండర్ బ్రిడ్జి ఎస్సై యాదగిరి పట్టుకుని కేసు నమోదు చేశారు. కరీమాబాద్‌కు చెందిన వల్లం సమ్మయ్య ఈ నెల 6న డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా.. బట్టల బజార్‌లో , ఖిలా వరంగల్‌కు చెందిన గూడూరు శివను ఈ నెల 9న ఫోర్ట్ రోడ్‌లో ఎస్సై యాదగిరి పట్టుకున్నట్లు ఆయన వివరించారు.

అదే ప్రాంతానికి చెందిన తోట రవిని, చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లికి చెందిన ఇస్లావత్ మనోహర్‌ను వరంగల్ రైల్వే స్టేషన్ పట్టుకున్నట్లు తెలిపారు. వరంగల్ లేబర్‌కాలనీకి చెందిన మేడిచర్ల స్వామి ఈ నెల 3న మద్యం తాగి వాహనం నడుపుతూ..కాశీబుగ్గ వద్ద ఎస్సై ఫసియోద్దీన్‌కు పట్టుబడ్డాడు. వీరందరినీ సోమవారం రెండో తరగతి మేజిస్ట్రేట్ భానుమూర్తి ముందు హాజరుపర్చగా వారికి జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. అంతేకాకుండా మరో 9 మందికి రూ .15వేల జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...