ట్రాఫిక్‌ సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి


Mon,September 9, 2019 03:06 AM

-ఈస్ట్‌జోన్‌ డీసీపీ కేఆర్‌ నాగరాజు
రెడ్డికాలనీ, సెప్టెంబర్‌ 08 : ట్రాఫిక్‌ సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈస్ట్‌జోన్‌ డీసీపీ కేఆర్‌ నాగరాజు అన్నారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలోని ట్రాఫిక్‌ శిక్షణా కేంద్రంలో ఆదివారం ఒకరోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈస్ట్‌జోన్‌ డీసీపీ నాగరాజు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ యుక్త వయస్సులో తలెత్తే ఆరోగ్య సమస్యలపై అలసత్వంతో వ్యవహరించడంతో 40 సంవత్సరాలకు పైబడి వయస్సు నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి అనారోగ్య సమస్యలను మనదరికి రానీయకుండా జాగ్రత్తపడడంతో పాటు తమ వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ కోసం వ్యక్తిగత శ్రద్ధ అవసరమని సూచించారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ విదులు నిర్వర్తించే పోలీసులకు త్వరితగతిన కండరాలు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం అధికమని, అందుకోసం ట్రాఫిక్‌ సిబ్బంది ముందస్తు ఆరోగ్య నివారణ కోసం ఫిజియోథెరపి చికిత్స విధానాన్ని అవలంభించడం ద్వారా ఉపశమనం కల్గడంతో పాటు, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతో పాటు విధుల్లో చక్కగా రాణించగమన్నారు. అదేవిధంగా ప్రతీ పోలీస్‌ అధికారి కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ తమ ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉందని డీసీపీ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులకు సూచించారు. ట్రాఫిక్‌ నియంత్రించడంలో భాగంగా నిరంతరం రోడ్లపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్‌ పోలీసులకు తలెత్తే కండరాల రుగ్మతల నివారణ కోసం ఫిజియోథెరపి చికిత్స ద్వారా అవలంభించాల్సిన పద్ధతులతో పాటు, ఇల్లు, విధులు నిర్వర్తించే ప్రదేశంలోని వెంటనే ఉపశమనం పొందేందుకు ట్రాఫిక్‌ పోలీసులు తమకు తాముగానే అనుసరించాల్సిన ఫిజియోథెరపి చికిత్సపై ప్రముఖ ఫిజియోథెరపి వైద్య నిపుణులు డాక్టర్‌ జీ సురేశ్‌కుమార్‌ ట్రాఫిక్‌ సిబ్బందికి డెమో రూపంలో శిక్షణ అందజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌, హన్మకొండ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లు స్వామి, హన్నన్‌, ఎస్సైలు నజీరుద్దీన్‌, లక్ష్మీనారాయణ, ఫసియుద్దీన్‌, పగడయ్య, యాదగిరితో పాటు ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...