విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు..


Mon,September 9, 2019 03:06 AM

-ఈస్ట్‌జోన్‌ డీసీపీ కేఆర్‌ నాగరాజు
-నూతనంగా ఎన్నికైన ఎస్సై అభ్యర్థులకు సన్మానం
రెడ్డికాలనీ, సెప్టెంబర్‌ 08 : వృత్తి ధర్మంతో పాటు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా సమన్యాయం పాటిస్తూ ప్రజల మన్ననలు పొందాలని నూతనంగా ఎన్నికైన మాల ఎస్సైలకు వరంగల్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీ కేఆర్‌ నాగరాజు సూచించారు. సుబేదారిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం జరిగిన నూతన మాల ఎస్సైల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి అశోక్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నాగరాజు మాట్లాడారు. పవిత్రమైన శాంతిభద్రతలు కాపాడటంలో బీద బడుగు వర్గాలకు న్యాయం చేసి గురుతర బాధ్యతను నెరవేస్తూ భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. అంబేద్కర్‌ పెట్టిన రిజర్వేషన్ల మూలాన చదువుతో రాణించి ఎస్సైగా ఎంపికైన యువకులను నాగరాజు అభినందించారు. పేద ప్రజలమైన మనం కష్టపడి ఎస్సైగా ఎంపికైన తర్వాత కుటుంబ క్షేమాన్నే కాకుండా సమాజ సేవ కోసం తపనతో విధులు నిర్వహించాలని రిటైర్డ్‌ ఏఎస్పీ వై యాదయ్య పిలుపునిచ్చారు. సమాజానికి మార్గదర్శకులుగా ఎదగాలని సూచించారు. పేదరికం చదువుకు అడ్డం కాదన్నారు. పేద ప్రజల మన్నల్ని సాధించేందుకు పోలీసు వృత్తి ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు హసన్‌ అభిప్రాయపడ్డారు. నూతన మాల ఎస్సైల సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మన్నే బాబురావు, కోడెం మొగిలి, తొగరి అయిలయ్య, జమ్మికుంట జెడ్పీటీసీ శ్రీరాం శ్యాం, కార్పొరేటర్‌ జోరిక రమేశ్‌, గూడెప్పాడ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బండి రజినీకుమార్‌, మాలమహిళా కార్యదర్శి వెంకటమ్మ, మంచాల భాస్కర్‌, రమేశ్‌కుమార్‌, నర్సయ్య, జక్కుల నర్సయ్య, కనుకయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాల ఎస్సైలుగా ఎంపికైన వారికి శాలువా, మెమోంటోలతో అతిథులు ఘనంగా సన్మానించారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...