హరితహారం మొక్కలకు నష్టం కల్గించే వారిపై చర్యలు


Mon,September 9, 2019 03:06 AM

- క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి
- కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌
సుబేదారి, సెప్టెంబర్‌ 08: హరితహారం మొక్కలకు నష్టం చేసే వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదులు చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆదివారం 30 రోజుల ప్రత్యేకకార్యక్రమంపై ఎంపీడీవోలు, ప్రత్యేకాధికారులు, మండల పంచాయితీ అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామపంచాయతీలల్లో జరుగుతున్న పారిశుధ్యపనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ గ్రామపంచాయతీలో కనీసం 4 కిలోమీటర్ల అవెన్యూ ఫ్లాంటేషన్‌ తప్పనిసరిగా ఉండాలని, చిన్న మొక్కలుకాకుండా పెద్దమొక్కలనే నాటాలని అధికారులకు సూచించారు. మొక్కలు అందుబాటులో లేకపోతే కాకతీయ యూనివర్సిటీ నుంచి పెద్దమొక్కలు గ్రామపంచాయతీలకు తెప్పించుకోవాలని అన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీకి బ్లాక్‌ఫ్లాంటేషన్‌, శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డుల కోసం స్థానికంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని చెప్పారు.
అందుకు రెండురోజుల గడువు ఇస్తున్నట్లు తహసీల్దార్లకు సూచించారు. అన్ని గ్రామపంచాయతీలల్లో 30రోజుల ప్రణాళిక కార్యక్రమం పనులు రెగ్యులర్‌గా నిర్వహించాలని, ఉద్యోగులు ఈ కార్యక్రమానికి అత్యంతప్రధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ 30రోజులు ఉద్యోగులకు సెలువులు మంజూరుచేయకూడదని, విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులపై కఠినచర్యలు ఉంటాయని కలెక్టర్‌ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం 3 గంటలకు జెడ్పీ హాల్‌లో సమీక్షసమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో ప్రసూనరాణి, డీఆర్డీవో రాము, పంచాయతీరాజ్‌ డీఈ మహమూద్‌ తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...