భద్రకాళిని దర్శించుకున్న దాస్యం దంపతులు


Mon,September 9, 2019 03:05 AM

మట్టెవాడ, సెప్టెంబర్‌ 08: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా విలాసిల్లుతున్న శ్రీభద్రకాళీ అమ్మవారిని తెలంగాణ ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా నూతనంగా నియమితులైన వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ దంపతులు ఆదివారం ఉద యం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ సిబ్బంది, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వల్లభ గణపతికి , భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మహామండపంలో వినయభాస్కర్‌ దంపతులకు మహాదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తనను ఏ పదవి వరించినా అమ్మవారి అనుగ్రహం వల్ల ప్రజాభిమానం వల్ల వరిస్తున్నాయని, ఈ గౌరవం వరంగల్‌ ప్రజలందరిదని, కేసీఆర్‌కు వరంగల్‌పై ఉన్న అభిమానమే ఈ పదవి రావడానికి కారణమన్నారు. భద్రకాళీ అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర ఆడిట్‌ సంచాలకులు మార్తినేని వెం కటేశ్వర్‌రావు దర్శించుకుని పూజలు చేశారు. ఆయనతో పాటు అర్బన్‌ జిల్లా ఆడిట్‌ ఉప సంచాలకులు సీహెచ్‌ వేణుమాధవ్‌రెడ్డి, రూరల్‌ జిల్లా అధికారి దేవేందర్‌ తదితరులు ఉన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...