వేయిస్తంభాల గుడిలో భక్తుల విశేష పూజలు


Mon,September 9, 2019 03:05 AM

-శ్వేతార్క గణపతిగా అలంకరణ
-యాగశాలలో భక్తుల హోమాలు
రెడ్డికాలనీ, సెప్టెంబర్‌ 08: చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు 7వ రోజు విశేషమైన భక్తసమూహం దేవాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఉదయం ప్రాతఃకాల నిత్యాన్నిక కార్యక్రమాలు నిర్వర్తించి ఉత్తిష్ఠ గణపతికి కోనేరు తీర్థ గంగా జలాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించి స్వామివారిని శ్వేతార్క గణపతిగా ఆదర్పణశీర్షముల మంత్రాలతో అర్చనలు, ఆరాదనలు నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. రుద్రునికి రుద్రాభిషేకం, ఉత్సవ వరసిద్ధి వినాయకునికి గణపతి సూక్త మంత్రపఠనంతో జ్ఞానం, ఆరోగ్యం, శుర్ధోదక స్నానాలతో పూజలు నిర్వహించారు. డమరుకంతో హంస వాహనంపై స్వామివారికి వాహనసేవ నిర్వహించారు. యాగశాలలో నిత్యహోమాలు, లోక కల్యాణార్థం కుంజుల మహేష్‌ ఆధ్వర్యంలో వేద పండితులు, గణపతి నవగ్రహ రుద్రహోమాలు నిర్వహించారు. అనంతరం 300 మంది భక్తులకు మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం తిరునగరి శ్రవణ్‌కుమార్‌చే భక్తిగీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆడిట్‌ డైరెక్టర్‌ మాతినేని వెంకటేశ్వర్‌రావు, జిల్లా అధికారులు కిశోర్‌, రవిప్రసాద్‌ పాల్గొన్నారు. సేవా కార్యక్రమంలో కాణితోజు శివలింగాచారి, అనురాంచౌదరి, గంగాధర వీరాంజనేయులు, తంగెళ్లపెల్లినిర్మలాదేవి, కార్తీక్‌ పాల్గొనగా కార్యనిర్వహణాధికారి పి.వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...