పోషన్ అభియాన్ పటిష్టంగా అమలు చేయాలి


Sun,September 8, 2019 02:45 AM

ఖమ్మం,నమస్తే తెలంగాణ: పోషణ్ అభియా న్ అనుబంధ శాఖల అధికారులందరూ సమన్వయంగా పనిచేసి జి ల్లాలో పటిష్టంగా అమ లు చేయాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అన్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సె ప్టెంబర్ మా సంలో నిర్వహిస్తున్న పోషణ మాసం కార్యాచరణ ప్రణాళిక అమలుపై శనివారం సాయం త్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనుబంధ శాఖలు, పాఠశాల కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేసి పోషక ఆహార మాసాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. దీనిలో భాగంగా పాఠశాల, కళాశాలల్లో వైద్యశిబిరాలు నిర్వహించి విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించాలని, రక్త హీనతతో ఉన్న వారికి ఐరన్ ట్యాబ్‌లెట్లను అందించాలని కలెక్టర్ విద్యాశాఖాధికారులను, వైద్యాధికారులను ఆదేశించారు.

పోషణ మాసంలో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు పోషణ అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలని, రక్తహీనత పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పోషణ మాసంపై ప్రత్యేకంగా రూపొందించిన ప్రతిజ్ఞను జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖాధికారులతో చేయించారు. అనంతరం పోషణ మాసంపై రూపొందించిన గోడపత్రిలను కలెక్టర్ ఆవిష్కరించారు. అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడింబా, శిక్షణ కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రియాంక, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ బీ కళావతిబాయి,ఐసీడీఎస్ బ్లాక్ కో ఆర్డినేటర్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ, విద్యాశాఖాధికారులు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అలివేలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...