కాళేశ్వరానికి జాతీయ హోదా ప్రకటించాలి..


Sun,September 8, 2019 02:44 AM

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు వరప్రదాయినిగా నిర్మాణం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో నిర్మాణం చేస్తున్న తాగు, సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపుతో చూస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఉపయోగపడే విధంగా రూప కల్పన చేసి చేపడుతున్న రాష్ట్ర పథకాలు, ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు.

ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని పార్లమెంటులో ఇప్పటికే ఆరు సార్లు ప్రభుత్వాన్ని కోరామన్నారు. అదేవిధంగా కేంద్రం ప్రకటించిన హర్ ఘర్..జల్ అనే పథకంలో భాగంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ప్రతి ఇంటికి తాగునీరు పథకంలో భాగంగా ఇప్పటికే నీతి ఆయోగ్ కూడా ఇప్పటికే 24 వేల కోట్లు నిధులు అవసరమవుతాయని గుర్తించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించిందని గుర్తు చేశారు. రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, నిధులు, ప్రాజెక్టుల మంజూరుపై కేంద్రం తెలంగాణ రాష్ర్టాన్ని చిన్న చూపు చూడ కుండా నిధులు మంజూరు చేయా లని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించిన 3250 కిలో మీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు. జాతీ య స్థాయిలో ప్రకటన చేసినప్పటికి నిధుల మంజూరు విషయంలో కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులు, నిధుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.కేవలం 1250 కిలో మీటర్లు మాత్రమే నెంబరింగ్ ఇచ్చారు కానీ పనులు ప్రారంభంలో చిన్న చూపు చూస్తున్నారన్నారు. ప్రకటించిన జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రధానంగా రైల్వే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, భద్రాచలం రైల్వేలైన్లు నిర్మాణం తక్షణం చేపట్టాలని డిమాండ్ చేశారు. సారపాక వరకు రైల్వే లైను పొడిగించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ స్థాయిలో మంచి చర్చ జరిగి గుర్తింపు లభించే విధంగా రూపకల్పన చేసిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఎంతో మంచి ఫలితాలు రానున్నాయన్నారు. జాతీయ స్థాయిలో కేంద్రం గ్రామీణ వ్యవస్థలో తీసుకరాని మార్పులను తెలంగాణ ప్రభుత్వం తీసుకోస్తుందన్నారు.ప్రతి పక్షాలు ఆరోపణలు, అవాకులు చవాలుకు మాట్లాడరాదని హితవు పలికారు.

సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ కమల్‌రాజ్, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, మేయర్ పాపాలాల్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, గ్రంథాయల సంస్థ చైర్మన్ ఖమర్, ఏఎంసీ చైర్మన్ వెంకటరమణ, ఆర్‌జేసీ కృష్ణ, కార్పొరేటర్ కమర్తపు మురళి, నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య, పిన్ని కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...