టెక్స్‌టైల్ పార్కు పనులు వేగవంతం


Sun,September 8, 2019 02:40 AM

-మడికొండ శివారులో పూరి ్తకావస్తున్న షెడ్ల నిర్మాణాలు
-అత్యాధునిక టెక్నాలజీతో నడిచే యంత్రాల ఏర్పాటు
-సుమారు ఎనిమిది వేల మందికి ఉపాధి అవకాశాలు
-ఫలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కృషి


మడికొండ శివారులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న టెక్స్‌టైల్ పార్కు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మొదటి విడతలో భాగంగా చేపడుతున్న 160 షెడ్ల నిర్మాణాలు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. నాణ్యత గల వస్త్ర తయారీ కోసం నిర్వాహకులు అత్యాధునిక టెక్నాలజీ కలిగిన యంత్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో సూరత్‌కు వలస వెళ్లిన చేనేత కార్మికులను తిరిగి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సత్ఫలితాలు వస్తున్నాయి. కాకతీయ టెక్స్‌టైల్స్, వీవర్స్ వెల్ఫేర్ పొదుపు పరపతి పరస్పర సహాయక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు వచ్చారు. టైక్స్‌టైల్ కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతను అందించనున్నాయి.

60 ఎకరాల్లో పార్కు నిర్మాణం
తెలంగాణ నుంచి వలస వెళ్లిన 364 మంది కార్మికులు కాకతీయ టెక్స్‌టైల్, వీవర్స్ వెల్ఫేర్ పొదుపు పరపతి పరస్పర సహాయక సహకార సంఘం ఏర్పాటు చేసుకుని మడికొండ శివారులోని టీఎస్‌ఐఐసీకి చెందిన 60 ఎకరాల సువిశాలమైన స్థలంలో టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 364 యూనిట్లను స్థాపించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ పథకం ద్వారా పార్కుకు రూ.8 కోట్లు కేటాయించగా, సభ్యులు మరో రూ.2 కోట్లు కలిసి పార్కులో మౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, కంపౌండ్, వాటర్ ట్యాంక్ నిర్మాణాలను చేపట్టారు. కాగా తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మొదటి విడతలో భాగంగా 160 యూనిట్లను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.కోటిన్నర వరకు పెట్టుబడి అవుతోంది. ఇందులో సిండికేట్, కెనరా బ్యాంకుల ద్వారా ఒక్కో యూనిట్‌కు రూ.1.3 కోట్లు రుణాన్ని మంజూరు చేసింది. నాణ్యమైన దుస్తుల తయారీ కోసం అత్యాధునిక టెక్నాలజీతో నడిచే రాపర్ మిషన్స్ విత్ జక్కార్డ్, డాబీ యంత్రాలను స్థాపించనున్నారు. ఇక్కడ తయారైన వస్ర్తాలను ఇతర రాష్ర్టాలతో పాటు విదేశాలను ఎగుమతి చేయనున్నారు. టెక్స్‌టైల్స్ పార్కుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు పది వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

గత ప్రభుత్వాల అశ్రద్ధ వల్ల అజాంజాహి మిల్లు మూతపడింది. దీంతో చేనేత కార్మికులు పొట్ట చేత పట్టుకుని పవర్‌లూమ్స్‌పై ఆధారపడి ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక వలస వెళ్లిన వారికి ఆధారం చూపించింది. దేశంలో ఏ రాష్ట్రం చేనేత, టెక్స్‌టైల్ రంగంపై ఆలోచన చేయలేదు. కానీ సీఎం కేసీఆర్ ఆలోచన చేసి కార్మికుల బతుకులకు భరోసా కల్పించారు. బతుకమ్మ చీరెల తయారీతో చేతినిండా పని దొరుకుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ పథకం ద్వారా రూ.8 కోట్లు తీసుకున్న ఏకైక సొసైటీ మాదే. త్వరలోనే యూనిట్లను ప్రారంభించి సూటింగ్స్ అండ్ షర్టింగ్స్‌ను తయారు చేయనున్నాం. సొసైటీకి సహకారం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.
-దర్గాస్వామి, సొసైటీ అధ్యక్షుడు

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...