సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి


Sun,September 8, 2019 02:38 AM

ఎల్కతుర్తి : సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని దండేపల్లిలో రైతు పరస్పర సహాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల షాపును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం ఇలా సహకార సంఘం ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా సీఎం కేసీఆర్ ముందస్తుగానే ఇతర రాష్ర్టాల నుంచి యూరియాను తెప్పిస్తున్నారని గుర్తుచేశారు. అనంతరం రైతులకు ఎరువులను అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, ఏవో రాజుకుమార్, సర్పంచ్ పుట్ట ప్రమీల, ఎంపీటీసీ బోంపల్లి భవానీ, నాయకులు దేవేందర్‌రావు, ప్రతాప్, మహేందర్, మదనమోహన్‌రావు, కొంరెల్లి, సంపత్‌రావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...