మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి


Sun,September 8, 2019 02:37 AM

హసన్‌పర్తి, సెప్టెంబర్ 7: 30 రోజు ల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు జ్యూట్ బ్యాగ్‌ల తయారు చేసి లబ్ధి పొందవచ్చని డీఆర్‌డీఏ పీడీ ఎం సంపత్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని సంస్కృతి విహార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న జ్యూట్ బ్యాగ్ తయా రీ ముగింపు శిక్షణ కార్యక్రమానికి ఆ యన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

30 రోజుల ప్ర ణాళికలో భాగంగా ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకోవడం శిక్షణ ముగించుకున్న అభ్యర్థులకు కలిసి వచ్చిందన్నారు. ప్రస్తుతం జ్యూట్ బ్యాగుల మం చి ఆదరణ ఉంటుందని, నేర్చుకున్న శిక్షణ ద్వారా జ్యూట్ బ్యాగ్ తయారీ యూనిట్‌ను స్థాపించి మార్కెటింగ్ చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా శిక్షణలో అవగాహన కల్పించిన డీపీఎం భవాని, సీఏ అమరావతిలను పీడీ సంపత్‌రావు అభినందించి, శిక్షణ పూర్తి చేసుకు న్న 60 మందికి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎల్‌డీపీ సత్యజిత్, డైరెక్టర్ హేమంత్‌కుమార్, సి బ్బంది కిశోర్‌బాబు, ఎండీ బషీర్, గెస్ట్ ఫ్యాకల్టీ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...