పారిశుధ్య పనులను పరిశీలించిన ఎంపీడీవో


Sun,September 8, 2019 02:36 AM

మండలంలోని రాపాకపల్లె, దేవునూర్, సోమదేవరపల్లె గ్రామాల్లో 30 రోజుల ప్రణాళికలో గ్రామాల్లో చేపట్టిన పారిశుద్ధ్యపనులను ఎంపీడీవో జవహర్‌రెడ్డి శనివారం పర్యవేక్షించారు. గ్రామంలోని మూడు రకాల కమిటీలు పూర్తి స్థాయిలో పనులు చేయాలని సూచించారు. రాకపాపల్లెలో సర్పంచ్ కందూకురి వినోద, దేవునూర్ సర్పంచ్ చిర్ర కవిత కుమార్, సోమదేవరపల్లె సర్పంచ్ తొట మంజుల, ఎంపీటీసీ లక్క సునీత శ్రీనివాసు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాగా మండల కేంద్రంలో సర్పంచ్ ఎర్రబెల్లి శరత్ చంద్రప్రసాద్, కార్యదర్శి రఘుపతిరెడ్డి, ఉప సర్పంచ్ అరుణా, వార్డు సభ్యులు గ్రామంలో పర్యటించి గ్రామంలో పారిశుధ్య పనులు చేయాల్సిన ప్రదేశాలను గుర్తించారు. లోతట్టు ప్రాంతంలో నిలిచిన వర్షపు నీరు నిల్వ లేకుండ చేయడం కోసం తక్షణమే చేపట్టవలసిన పనులు చేయడానికి శ్రీకారం చుట్టారు. ప్రజలందరూ అభివృద్ధికి సహకరించాలని ఎంపీడీవో కోరారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...