గ్రామాభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలి


Sun,September 8, 2019 02:36 AM

ధర్మసాగర్, సెప్టెంబర్ 07 : గ్రామ అభివృద్ధికి ప్రజలందరు సహకరించాలని వరంగల్ అర్బన్ జిల్లా జెడ్పీ సీఈవో ప్రసూనరాణి అన్నారు. మండలంలోని శాయిపేటలో శనివారం సర్పంచ్ మామిడి రవీందర్ యాదవ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులనుద్ధేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో గ్రామంలో 60 మందితో కమిటీలు వేసుకొని గ్రామంలో ప్రతీ ఇంటి, గ్రామ పరిశుభ్రత, మొక్కలు పెంచడం, విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలో ఉన్న లక్ష్యం నెరవేర్చాలని అన్నారు. సమావేశంలో మండల రైతు సమన్వయ సమితి కో-అర్డినేటర్ సోంపెల్లి కరుణాకర్, ఎంపీటీసీ సాయం శేశిరేఖ, పంచాయతీ కార్యదర్శి జాయ్, ఉప సర్పంచ్ రాజు, వార్డు సభ్యులు, పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...