సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు


Sat,September 7, 2019 02:58 AM

-విద్యారంగానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం
-జెడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్
-ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం
-పాల్గొన్న ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్

సుబేదారి, సెప్టెంబర్ 06: సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని జెడ్పీ చైర్మన్ డాక్టర్ మారెపల్లి సుధీర్‌కుమార్ అన్నారు. మాజీ రాష్ట్రపతి, ఉపాధ్యాయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని వరంగల్ అర్బన్ జిల్లా విద్యాశాఖ అధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుధీర్‌కుమార్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి అత్యున్నతమైనది, సమాజాన్ని నిర్మించేది, భావిభారత పౌరులను అందించేది ఉపాధ్యాయులేనని అన్నారు. సీఎం కేసీఆర్ చదువు నేర్పిన గురువులను పూజించడంలో మార్గదర్శకంగా నిలిచారని చెప్పారు. సీఎం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా విద్యా బుద్ధులు నేర్పిన గురువు మృత్యుంజయశర్మకు పాదాభివందనం చేసి ప్రారంభిస్తారని గుర్తుచేశారు.

కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకురావడంతో పోటీ పరీక్షల్లో గ్రామీణ విద్యార్థులు విజయం సాధిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామాల మార్పులో తమదైన ముద్ర వేసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, జేసీ దయానంద్, విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, ఎంఈవోలు హాజరయ్యారు. ఈసందర్భంగా జిల్లా వ్యాప్తంగా 45 మంది ప్రభుత్వ, ఏడుగురు ప్రైవేట్ ఉపాధ్యాయులను శాలువా, మెమోంటోలతో సన్మానించారు. కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...