30 వరకు రాష్ట్రీయ పోషణ మాసం


Sat,September 7, 2019 02:54 AM

అర్బన్ కలెక్టరేట్, సెప్టెంబర్ 06: ఈనెల 30 వరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ పోషణ మాసం నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి ఎం సబిత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఐదు అంశాలపై అంగన్‌వాడీ సెంటర్ల వద్ద కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. మొదటి వెయ్యిరోజులు (గర్భిణులు, బాలింతలు, చిన్నారులు)కు సంబంధించి పోషణ, సంరక్షణపై అవగాహన కల్పిస్తారన్నారు. రక్తహీనత పరీక్షలు చేయించుకోవడం అన్ని వయస్సుల వారికి ఎంతో అవసరమని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాల పరిశుభ్రత, ఆహార పరిశుభ్రతను పాటించాలన్నారు. 6 నెలల వరకు పిల్లలకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...