పాత దారినే కొనసాగించాలని రహదారిపై స్థానికుల ధర్నా..


Sat,September 7, 2019 02:54 AM

వరంగల్ క్రైం, సెప్టెంబర్06: గతంలో వాడుకలో ఉన్న దారినే కొనసాగించాలని కోరుతూ కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై లష్కర్‌సింగారం స్టేజీ వద్ద స్థ్ధానికులు శుక్రవారం పెద్ద ఎత్తున అందోళన చేసి రోడ్డుపై ధర్నా చేపట్టారు. లష్కర్‌సింగారం వాసులు పెట్రోల్ పంపు, హన్మకొండ చౌరస్తా, పోచమ్మకుంట శ్మశాన వాటిక వెళ్లేవారు కొన్నేళ్లుగా కాలనీ ఎదురుగా ఉన్న యూటర్న్ నుంచే వెళ్లేవారు. ట్రాఫిక్ క్లియరెన్స్ రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా పోలీస్ ఉన్నతధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ పొలీసులు యూటర్న్ ను మూసివేశారు.

అయితే కాలనీలో ఎవరైనా మృతి చెందితే దహనసంస్కారాలకు వెళ్లడం, చౌరస్తా వెళ్లాలన్నా పాత ఆర్టీవో ఆఫీస్‌కు వరకు వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి వస్తోందని కాల నీవాసులు వాపోయారు. విషయం తెలుసుకున్న ఏసీసీ బోనాల కిషణ్, ట్రాఫిక్ సీఐ హన్నన్, ఎస్సైలు శ్రీనాథ్, దేవేందర్‌రెడ్డి, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని స్థానికులతో మాట్లాడి వారిని శాంతింపజేశారు. సమస్యపై లిఖితపూర్వకంగా రాసిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అందోళనలో స్థ్ధానికులు చాడ శ్రీనివాస్‌రెడ్డి, భిక్షపతి, అనిల్, ఎల్లేశ్ పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...