ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్


Sat,September 7, 2019 02:54 AM

-ఎమ్మెల్యే అరూరి రమేశ్
భీమారం, సెప్టెంబర్ 06 : తెలంగాణలో ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నాడని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. శుక్రవారం హంటర్‌రోడ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. మొత్తం 70 మంది లబ్ధిదారులకు రూ.68.08 లక్షల కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు దేవరకొండ అనిల్‌కుమార్, సూర సతీష్‌యాదవ్, అంకూస్‌బాబు, శంకర్, ప్రశాంత్ పాల్గొన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...