గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు..


Sat,September 7, 2019 02:53 AM

-అధికారులను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ
అర్బన్ కలెక్టరేట్, సెప్టెంబర్ 06: ఈ నెల 11న జరగనున్న వినాయక నిమజ్జన వేడుకలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నగర పరిధిలోని 10 నిమజ్జన ప్రాంతాల్లో పర్యవేక్షణకుగానూ అధికారులను నియమిస్తూ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ శుక్రవారం ఉత్తుర్వు లు జారీ చేశారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో బృందాన్ని నియమించారు. ఈ బృందంలో ఒక జిల్లా స్థాయి అధికారితో పాటు తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్‌ఐ, ఎమ్మారై, వీఆర్‌వోలు సభ్యులుగా ఉంటా రు. మొత్తం 102 మంది అధికారులను పర్యవేక్షణకు ని యమించారు. నిమజ్జనం సందర్భంగా బృందాలు రెండు షిప్టుల్లో పనిచేస్తాయి. మధ్యా హ్నం 2గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ఒక షిప్టు, రాత్రి 11 నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు రెండో షిప్టులో నియమించిన అధికారుల బృందం పర్యవేక్షిస్తారు.

వీరితో పాటు జేసీ ఆధ్వర్యంలో లేబర్ డిప్యూటీ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పర్యాటక శాఖ అధికారి, జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి, జిల్లా సంక్షేమాధికారి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు కలిపి ఆరుగురు సభ్యులతో కూడిన నోడల్ అధికారుల బృందం కూడా పర్యవేక్షిస్తుంద ని కలెక్టర్ తెలిపారు. అలాగే వరంగల్ ఆర్డీవో ఆధ్వర్యంలో హన్మకొండ, వరంగల్, కాజీపేట, ఖిలా వరంగల్ తహసీల్దార్లు ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు బృందాలను కోఆర్డినేట్ చేయనున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలని ఫిషరీష్ డీడీని, విద్యుత్ శాఖ అధికారులను, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్‌కు, వైద్యారోగ్య శాఖను, దేవాదాయ శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...