ఫార్మసీకి ఉన్నత అవకాశాలు: రాజేశం


Sat,September 7, 2019 02:52 AM

రెడ్డికాలనీ, సెప్టెంబర్06: ఫార్మసీకి ఉన్నత అవకాశాలు ఉన్నాయని కామర్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య చింతకింది రాజేశం అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ ఫార్మసీ విభాగంలో బీఫార్మసీలో నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు శుక్రవారం కాలేజీ సెమినార్ హాల్‌లో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. దీనికి రాజేశం హాజరై మాట్లాడుతూ వ్యాపార పరంగా, మార్కెట్ పరంగా, అమ్మకాల పరంగా ఫార్మసీకి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. అవరోధాలు, మార్కెట్ పరిస్థితులు, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకృత ఆర్థిక విధానాల స్థితిగతులను వివరించారు. ఆచార్య అచ్చయ్య మాట్లాడుతూ మెదడు, శరీరం, యోగా గురించి విద్యార్థులకు వివరించారు. డీన్ ఆచార్య సారంగపాణి ఫార్మసీ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య కిషన్ మాట్లాడుతూ ఫార్మసీ సిలబస్, పరీక్షలు, ప్రమోషన్ నిబంధనల గురించి వివరించారు. అనంతరం రాజేశాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...