బాలుడిని కిడ్నాప్ చేసిన ముఠా అరెస్ట్


Fri,September 6, 2019 04:19 AM

-యశ్వంత్‌ను అమ్మకానికే యత్నించిన వైనం
-రూ.రెండున్నర లక్షలకు బేరం
-విస్తృత ప్రచారంతో భయపడి వదిలివేసిన నిందితులు

మట్టెవాడ, సెప్టెంబర్ 05: గత నెల 31న వరంగల్ ఎంజీఎం వద్ద ఏడేళ్ల యశ్వంత్‌ను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిన నలుగురు సభ్యుల ముఠాను మట్టెవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నర్సయ్య మాట్లాడుతూ యశ్వంత్‌ను కిడ్నాప్ చేసి రూ.2,50,000 లకు అమ్మకానికి పెట్టారని వివరించారు. సంగెం మండలం కాట్రపల్లికి చెందిన కర్నె అరుణ, ఆమె భర్త రామస్వామి, మొండ్రాయికి చెందిన ఇండ్ల సునిత భర్త శ్రీనివాస్ ఈ కిడ్నాప్ వ్యవహారంలో పాత్రులని చెప్పారు. వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీపీ చెప్పారు. ఈ నెల 31న ఎంజీఎం వద్ద నుంచి అరుణ యశ్వంత్‌ను తీసుకుని ద్విచక్రవాహనంపై రామస్వామి సహాయంతో తీసుకుని వెళ్లి సునీత ఇంట్లో దాచిపెట్టి అమ్మకానికి యత్నించినట్లు తెలిపారు. బాలుడి తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలని, వారికి డబ్బులు అవసరమున్నాయని చెప్పి బాలుడిని మేకప్ చేసి ఫొటోలు తీసి పిల్లలు లేనివారికి పంపడానికి పోటోలు పంపించారన్నారు.

కాని వారు నిరాకరించడంతో పాటు పోలీసులు విస్తృతంగా తిరుగుతున్నారన్న భయంతో యశ్వంత్‌ను తీసుకొచ్చి వదిలిపెట్టి పోవడం జరిగిందన్నారు. ఈ క్రమంలో యశ్వంత్ ఇచ్చిన సమాచారం, సీసీ పుటేజిల ఆధారంగా శోధించిన తమ సిబ్బంది అరుణ, రామస్వామి, సునీతలతో పాటు వారికి సహకరించిన శ్రీనివాస్‌ను కూడా అరెస్ట్ చేసి వారు వాడిన ద్విచక్రవాహనం, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుని వారిని కోర్టులో హజరుపరిచినట్లు ఏసీపీ వివరించారు. సమావేశంలో మట్టెవాడ ఇన్స్‌పెక్టర్ ఎల్ జీవన్‌రెడ్డి, ఎస్సైలు బండారు వెంకటేశ్వర్లు, డేగల రమేవ్, దీపక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కాశీబుగ్గలో రేషన్ బియ్యం పట్టివేత
కాశీబుగ్గ : ప్రభుత్వం రాయితీ పై పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం 20 క్వింటాళ్లను గురువారం రాత్రి ఇంతేజార్‌గంజ్ పోలీసులు పట్టుకున్నా రు. కాశీబుగ్గ శివాలయం వెనుక వైపుగల సామల మధు నివాసంలో దేశాయిపేటకు చెందిన బియ్యం వ్యాపారికి అమ్ముతున్న క్ర మంలో పోలీసుల కు సమాచారం అందింది. రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి బియ్యంను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
హసన్‌పర్తి, సెప్టెంబర్ 5: మండలంలోని నాగారం గ్రామానికి చెందిన రావుల రమేశ్ (43) సెప్టెంబర్ 1న నాగారం చెరువులో చేపలు పడుతూ నీటి ప్రవాహ వేగానికి వాగులో గల్లంతయ్యాడు. ఐదు రోజులుగా గ్రామస్తులు, మత్స్యకార్మికులు, గజ ఈతగాళ్లు రమేశ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం కనిపించలేదు. దీంతో రమేశ్ భార్య స్వరూప గురువారం పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయంపై ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ పుప్పాల తిరుమల్ మృతుడి భార్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

నిరక్షరాస్యులకు విద్య నేర్పించాలి
ఐనవోలు : నిరక్షారాస్యులకు విద్య నేర్పించాలని వయోజన విద్య జిల్లా సూపర్‌వైజర్ పుల్లూరి వేణుగోపాల్ అన్నారు. గురువారం మండలంలోని ఒంటిమామిడిపల్లి పాఠశాల విద్యార్థులతో కలిసి వయోజన విద్యపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు వయోజన విద్య అవశ్యకత పైన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్నేని మధుమతి, సర్పంచులు ఫోరం మండలాధ్యక్షుడు ఆడెపు దయాకర్, హెచ్‌ఎం రమాదేవి, ఎస్‌ఎంసీ చైర్మన్ రాజు, కమిటి సభ్యులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...