చెరువుల్లో సబ్సిడీ చేప పిల్లల విడుదల


Fri,September 6, 2019 04:17 AM

ఐనవోలు సెప్టెంబర్ 05 : మండలంలోని కక్కిరాలపల్లి, గర్మిళ్లపల్లి చెరువులు, కుంటల్లో రాష్ట్రం ప్రభుత్వ మత్స్యకారులకు ఉచితంగా పూర్తి సబ్సిడీపై అందజేసిన చేప పిల్లలను గురువారం విడుదల చేశారు. కక్కిరాలపల్లి గ్రామానికి వచ్చిన లక్ష ఎనభై వేల చేప పిల్లలను స్థానిక ఎంపీటీసీ తాటికాయల రమేశ్, ఉప సర్పంచ్ బొల్లం ప్రకాశ్, గర్మిళ్లపల్లి గ్రామానికి వచ్చిన లక్ష ఆరవై వేల చేప పిల్లలను స్థానిక సర్పంచ్ గండి మల్లికాంబ ముఖ్య అతిథులుగా హాజరై చెరువు లు, కుంటల్లో చేప పిల్లలను వదిలారు. ఈ సం దర్భంగా ముదిరాజ్ సంఘం సభ్యులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో ఎంపీటీసీ మౌనిక, ఉప సర్పంచ్ ప్రతాప్‌రె డ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కాటబోయి న కుమారస్వామి, చార్ల సురేశ్, సర్పంచ్ గోపా ల్, సంఘం సభ్యులు కుమారస్వామి, వీర య్య, సోమయ్య, యాకయ్య, రవి, మోహన్, భిక్షపతి, శ్రీను, భాస్కర్, రాములు, లింగమూర్తి, రాజయ్య, సమ్మయ్య పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...