తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు


Fri,September 6, 2019 04:17 AM

సుబేదారి,సెప్టెంబర్ 05: కాస్తో కూస్తో పార్టీని నమ్ముకొని ఉన్న కొద్దిపాటి తెలుగుదేశం నాయకుల్లోనూ విబేధాలు వచ్చాయి. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పరుషపదజాలంతో ఒకరిపై ఒకరు చొక్కాలు పట్టుకొని దుమ్మెత్తుపోసుకున్నారు. ఈఘటన గురువారం హన్మకొండ ఎన్‌జీవోస్‌కాలనీరోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు గన్నోజు శ్రీనివాసచారి ఉమ్మడి జిల్లా పార్టీ సమావేశం ఉందని పార్టీ శ్రేణులకు, మీడియాకు సమాచారం పంపించారు. దీంతో పార్టీశ్రేణులు, మీడియా ప్రతినిధులు వచ్చారు. శ్రీనివాస్‌చారి తన అనుచర వర్గంతో వేదికపై కూర్చున్నారు. దీంతో పార్టీసీనియర్ నాయకులు కంప వినోద్, సాంబయ్య, విద్యాసాగర్‌రావు, పిట్టల శ్రీనివాస్‌తోపాటు జయశంకర్, జనగామ, మహబుబాద్ నుంచి వచ్చిన మరికొంతమంది నాయకులు శ్రీనివాస్‌చారి మీదికి తిరగబడ్డారు. పార్టీ సీనియర్ అయిన మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, సీనియర్‌నాయకుడు గట్టుప్రసాద్‌బాబును స్టేజిపైకి పిలువకపోవడంతో వారు ఆగ్రహానికి గురైనారు. పార్టీ ద్రోహివి, కోవర్టువు అంటూ శ్రీనివాస్‌చారితో గొడవపడ్డారు. చొక్కాలుపట్టుకొని నెట్టకున్నారు.

బెడిసినకొట్టిన గన్నోజు ప్రయత్నాలు..
టీడీపీ నుంచి పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి, వరంగల్‌రూరల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గన్నోజు శ్రీనివాస్‌చారి బీజేపీలోకి వెళ్లడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాష్‌రెడ్డి బీజేపీలో చేరిన విష యం తెలిసిందే. ఆయనతోపాటుగా శ్రీనివాస్‌చారి కూడా ఆపార్టీలోకి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. అయితే బీజేపీ నుంచి పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి తనకే ఇవ్వాలని పార్టీ పెద్దలతో పట్టబట్టారు. అయితే ఇన్‌చార్జి ఇవ్వలేమని చెప్పడంతో ఆయన తన చేరిక నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లా టీడీపీ నాయకులకు,కార్యకర్తలకు తెలిసింది. ఈక్రమంలో పార్టీ కార్యాలయంలో శ్రీనివాస్‌చారి మీటింగ్ ఏర్పాటుచేయడం పట్ల పార్టీ శ్రేణులు ఆగ్రహంతో గొడవపడి చివరికి చొక్కాలు పట్టుకున్నారు. చేసేది ఏమీలేక సమావేశ నుంచి శ్రీనివాస్‌చారి జారుకున్నాడు. ఈగొడవ ఇలా ఉండగా.., ఎన్‌జీవోస్‌కాలనీలో ఇప్పుడు పార్టీ కార్యాలయంలో రెండు జిల్లాల సమావేశాలు జరుపుకోవడానికి పార్టీ అదిష్టానం అనుమతి ఇచ్చింది.

ప్రతీ జిల్లా కమిటీకి పార్టీ కార్యాలయ మెయింటనెన్స్ కోసం నెలకు రూ.50వేలు ఇచ్చేది. ఇంతకుముందు వరంగల్ అర్బన్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి, ఇటీవలే బీజేపీలో చేరిని ఈగ మల్లేశం, వరంగల్ రూరల్ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస్‌చారికి నెలకు రూ.50వేలు వచ్చేవి. అయితే టీడీపీ ఏపీలో అధికారం కోల్పోవడంతో ఏడు నెలలుగా రావడం లేదు. అప్పటి నుంచి పార్టీ కార్యాలయ అద్దె కట్టడంలేదు. పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు పార్టీ నుంచి వచ్చిన డబ్బులను కూడా శ్రీనివాస్‌చారి కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై కొంతమంది కార్యకర్తలు, నాయకులు గొడవకి దిగినట్లు తెలిసింది. అయితే మహబుబాబాద్ జిల్లా పార్టీలో కూడా విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. గన్నోజు శ్రీనివాస్‌చారి బండిపుల్లయ్య వర్గాన్ని కాదని ఇంద్ర వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని పుల్లయ్య అనుచర వర్గం శ్రీనివాస్‌చారిపైకి గొడవకు దిగారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...