రాంపూర్‌లో కార్డన్ సెర్చ్


Fri,September 6, 2019 04:16 AM

మడికొండ : కాజీపేట మండలం రాంపూర్ గ్రామంలో గురువారం సాయంత్రం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 58 మంది పోలీసులు గ్రామంలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పాత నేరస్తుల ఇళ్లలో సోదాలు చేపట్టి వారి జీవన శైలి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ ఇన్‌స్పెక్టర్ సాదుల్లాబాబా మాట్లాడుతూ గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ సాధ్యపడుతుందని చెప్పారు. కాజీపేట ఏసీపీ నర్సింగరావు, కాజీపేట సబ్ డివిజన్‌లోని ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...