వెస్ ్టసిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతా..


Mon,August 26, 2019 02:43 AM

-వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
కాజీపేట, ఆగస్టు 25 : వర్ధన్నపేట నియోజకవర్గం శివారున ఉన్న వెస్ట్‌సిటీ కాలనీని పట్టణంలోని అన్ని కాలనీల కంటే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అ రూరి రమేశ్ అన్నారు. 34వ డివిజన్‌లో వెస్ ్టసిటీ కాలనీలో కాలనీ సొసైటీ అధ్యక్షుడు పండుగుల చంద్రయ్య ఆధ్వర్యం లో ఆదివారం పోచమ్మతల్లి బోనాలను ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరూ రి రమేశ్ హాజరై ఆలయం ఆవరణలో బోరుబావిని ప్రారంభించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గానికి శివారున వెస్ట్‌సిటీ కాలనీ ఉండడంతో చాలా కాలంగా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కాలనీలో సీసీ రోడ్లు, పైప్‌లైన్ పనులను త్వరలోనే ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీ ప్రధాన కార్యదర్శి చుండూరి రామ్మోహన్ రావు, ముఖ్య సలహాదారు మైసారపు సిరిల్ లారెన్స్, గౌర వ అధ్యక్షుడు గుండాల రవికుమార్, కోశాధికారి రాధాకృష్ణ, రవీందర్, నందకుమార్, నాయక్, డాక్టర్ తిరుమలాదేవి, జయ, విజయలక్ష్మి, బషీర్, వీరన్న, సురేందర్, దుప్పటి శి వకుమార్, భిక్షపతి, సుంక సతీశ్, శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...