ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల సేవా కార్యక్రమాలు


Mon,August 26, 2019 02:43 AM

రెడ్డికాలనీ, ఆగస్టు 25: కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జలశక్తి అభియాన్ శిబిరంలో భాగంగా ఆదివారం 5వ రోజు ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు క్షేత్రస్థాయి పర్యటనకు వె ళ్లారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ సుంకరి జ్యోతి ఆధ్వర్యంలో రాష్ట్రనలుమూలల నుంచి వచ్చిన 150 మంది వలంటీర్లు ఐదుగురు ప్రోగ్రాం అధికారులతో కలిసి ఎల్కతుర్తి మండలం బావుపేట గ్రా మాన్ని సందర్శించారు.

ఒకరోజు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పది బృందాలుగా విడిపోయి ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల గుంతలు (శానిటేషన్ పిట్స్), మొక్కలు నాటుటం, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను, పి చ్చిమొక్కలు తొలగించారు. అనంతరం ఎల్కతుర్తి ఎస్సై శ్రీధర్, స్థానిక సర్పంచ్ రాములుతో కలిసి పర్యావరణ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్నా రు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు రాంబాబు, ప్రవీణ్‌కుమార్, పల్లెర్ల శంకరయ్య, రజనీకుమార్, మల్లయ్య పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...