ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి కాజీపేట సీఐ అజయ్


Mon,August 26, 2019 02:42 AM

కాజీపేట, ఆగస్టు 25: ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కాజీపేట సీఐ అజయ్ సూచించారు. బాపూజీనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల లో జాక్సన్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో లైక్ ఫౌండేషన్ వారు ఆదివారం ఉ చిత వైద్య శిబిరం నిర్వహించారు. సీఐ అజయ్ ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. జాక్సన్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఇలాంటి కార్యక్ర మాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. డాక్టర్ సునీల్ వలుసతోపాటు అజయ్, శ్రీనివాస్, శివాణి, వాణీ అనేకమంది రోగులకు బీపీ, షుగర్, బోన్‌స్కాన్‌లతో పా టు అతి తక్కువ రుసుముతో థైరాయిడ్ పరీక్షలను చేశారు. అనంతం రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కోండ్ర సాయిప్రతాప్, ఉపాధ్యక్షుడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మోహషువా, సహాయ కా ర్యదర్శి శేషాద్రి ప్రదీప్, కంకణాల కార్తీక్, సోలేమాన్ రాజు, సంజయ్‌సింగ్, చింటు, శశాంక్, ఖాజా, సందీప్‌పాల్, రాజు తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...