కొత్తకొండ బ్రహ్మోత్సవాల్లో వీరభద్రీయులు పాల్గొనాలి


Mon,August 26, 2019 02:42 AM

భీమదేవరపల్లి: ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో వీరభద్రీయులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వీరభద్రీయ కులసంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కర్నె శివకుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని కొత్తకొండ ఆలయ సమీపంలో వీరభద్రీయ కులసంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీరభద్రీయులు సంచార జీవితం గడపడం వల్ల ప్రభుత్వ పథకాలేవీ దరి చేరడం లేదన్నారు. వీరభద్రీయుల పిల్లలు పెద్దపెద్ద చదువులు చదివేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. పిల్లల చదువు కోసం ప్రభుత్వం సైతం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని వివరించారు. అనంతరం మండలస్థాయి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో వీరభద్రీయ కులసంఘం వరంగల్ అర్బన్, రూరల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, జనగాం, సిద్దిపేట జిల్లాల అధ్యక్షులు గుములాపురం ఉప్పలయ్య, మల్లూరి రాజు, బానాల రాజుకుమార్, కాటి రాములు, కర్నె రాజమౌళి, కడారి వీరయ్య, మిట్టపెల్లి సత్తయ్య, అగుళ్ల శంకర్, సర్పంచ్ దూడల ప్రమీలసంపత్, ఎంపీటీసీ యాటపోలు రాజమణిశ్రీనివాస్, వీరభద్రీయులు పాల్గొన్నారు.

మండల కమిటీ సభ్యులు వీరే..
అధ్యక్షుడిగా గుములాపురం రమేశ్, ఉపాధ్యక్షుడిగా గుములాపురం రవి, ప్రధానకార్యదర్శిగా తిరుపతి, కోశాధికారిగా మిరియాల శివ, ముఖ్య సలహాదారులుగా మిరియాల రవి, గుములాపురం రవి, బోనాల శంకర్, మిరియాల రాంబాబు, ఆర్గనైజర్లుగా బోనాల శేఖర్, గుములాపురం ప్రవీణ్, మిరియాల రాజు, బోనాల సారయ్య, సమ్మయ్య ఎన్నికయ్యారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...