నాకు డాడీ కావాలి...


Mon,August 26, 2019 02:41 AM

భీమారం, ఆగస్టు25: డాడీ కావాలి.. మా డాడీకి ఏమైంది...నాకు డాడీ కావాలంటూ ఏడుస్తున్న చిన్నవాడిని చూసి ద్రవించని హృదయం లేదు. చెమ్మగిల్లని కనులు లేవు. అభంశుభం తెలియని ఆ బాలుడి ఆర్తనాదాలు అక్కడున్న వారందరి మనసును మెలిపెట్టాయి. ఈ హృదయవిదారకర ఘటన వివరాలు కేయూ ఎస్సై హరికృష్ణ వెల్లడించారు. పరకాలకు చెందిన పున్నం రాజు, కొడుకు రంజిత్ పరకాల నుంచి అంబాల రోడ్‌పై హన్మకొండకు వస్తుండగా హన్మకొండ నుంచి అంబాల పైపు వెళ్తున్న కారు లారీని ఓవర్ టెక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది.

ఈ ప్రమాదంలో పున్నం రాజు (35) అక్కడికక్కడే మృతి చెందారు. మృతిని కొడుకు పున్న రంజిత్(10) గాయలతో ప్రమాదం నుంచి బయట పడ్డాడు. బైక్‌ను ఢీకొట్టిన కారు ఆపకుండా వెళ్లిపోయింది. స్థానికులు వెంటపడిన వేగంగా వెళ్లిపోయ్యారని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఎ స్సై హరికృష్ణ, ఏఎస్సై భీంరెడ్డి, పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారును గుర్తించేందుకు కిట్స్ కాలేజీ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీ ఎంకు తరలించారు. బాలుడిని కుటుంబ సభ్యులకు అ ప్పగించినట్లు తెలిపారు. మృతుడు పరకాలలో బ్యాండ్ బాక్స్ డ్రై క్లీనింగ్ షాపులో పని చేస్తున్నట్లు తెలిపారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...