కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి


Sun,August 25, 2019 03:03 AM

హసన్‌పర్తి, ఆగస్టు 24: కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. హంటర్‌రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ 54, 55, 56, 57, 58 డివిజన్లకు సంబంధించిన విలీన గ్రామాల గ్రామ కమిటీల ఏర్పాటుపై ప్రజాప్రతినిధులు, నాయకులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ కమిటీల ఏర్పాటులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అదే విధంగా గ్రామాల వారీగా గ్రామ కమిటీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల చివరి వారంలో అన్ని గ్రామాల కమిటీలు, అనుబంధ కమిటీలను ఫైనల్ చేసి ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల వెంకటేశ్వర్లు, రాజునాయక్, బానోతు కల్పనతో పాటు డివిజన్ అధ్యక్షులు బిల్ల ఉదయ్‌రెడ్డి, చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, వెల్దండి స్వరూప, మేరుగు రాజేశ్‌గౌడ్, యాదగిరిగౌడ్, నాయకులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...