మత్తు పదార్థాల సరఫరాపై ఉక్కుపాదం ఏసీపీ నర్సింగరావు


Sun,August 25, 2019 03:03 AM

కమలాపూర్: మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామని కాజీపేట ఏసీపీ నర్సింగరావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో మండలంలోని అన్ని గ్రామాల కిరాణ, పాన్‌షాపు, చిరువ్యాపారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గుట్కా, గంజాయి వంటి మత్తు పదార్థాలను ప్రభుత్వం నిషేధించిందన్నారు. వ్యాపారులు తమ ఆదాయం కోసం గుట్కాలు విక్రయించడంతో అనేక మంది చెడు అలవాట్లకు పాల్పడుతున్నట్లు తెలిపారు. మండలంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల నిఘా ఉంటుందని, మత్తు పదార్థాలు పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతీ ఒక్క వ్యాపారి దుకాణం ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే ఉప్పల్ రైల్వే స్టేషన్ నుంచి రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటారన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జీ ఎల్కతుర్తి సీఐ శ్రీనివాసజీ, ఎస్సై సూర్యప్రకాశ్, పోలీసులు, వ్యాపారులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...