సీతంపేటలో విద్యుత్ అధికారులను తిప్పి పంపిన గ్రామస్తులు


Sat,August 24, 2019 03:18 AM

హసన్‌పర్తి, ఆగస్టు 23: మండలంలోని సీతంపేటలో విద్యుత్ బిల్లుల వసూళ్ల కోసం వచ్చిన విద్యుత్ అధికారులను శుక్రవారం తిరిగి వెనక్కి పంపారు. కొంతకాలంగా విద్యుత్ వినియోగదారులకు స్లాబ్ సిస్టం ద్వారా బిల్లులు వసూలు చేస్తున్న విషయం విదితమే. అయితే ప్రతినెల 30 రోజు ల వరకు కొట్టవలసిన బిల్లును, ఆతరువాత కొట్టవలసి రావడంతో యూ నిట్ పర్‌క్యాప్ రెట్టింపు వస్తుందని వినియోగదారులు గ్రామ పంచాయతీ ఆవరణలో ఆందోళనకు దిగారు. బిల్ కలెక్టర్ నిర్లక్ష్యం వల్ల ప్రతి నెల ఈ సమస్య ఉత్పన్నమై విద్యుత్ వినియోగదారులకు అదనపు పన్ను భారం పడుతుందని పేర్కొన్నారు. తక్షణమే విద్యుత్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...