వైభవంగా కుంకుమ పూజలు


Sat,August 24, 2019 03:17 AM

భీమారం, ఆగస్టు 23 : గోపాలపురంలోని మహాలక్ష్మి దేవాలయంలో మహిళలు సామూహిక కుంకుమ పూజలను వైభవంగా నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో 46వ డివిజన్ గోపాలపురంలోని మహాలక్ష్మి దేవాలయంలో శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో సామూహికంగా కుంకుమ పూజలు నిర్వహించారు. మహాలక్ష్మి అమ్మవారిని లక్ష గాజలతో అలంకరించారు.ఈ కార్యక్రమాలకు స్థానిక కార్పొరేటర్, ఆలయ కమిటీ చైర్మన్ సిరంగి సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకుడు నల్లానిచక్రవర్తుల రామకృష్ణామాచారి, మురళీధర్ ఆధ్వర్యంలో 259 మంది మహిళలతో ప్రత్యేక కుంకుమార్చన పూజలు చేశారు. డివిజన్‌లోని ఎఫ్‌సీఐ, బృందావన్, అరుణోదయ, బాలాజీ, వెంకటేశ్వర, ద్వారాక సాయి కాలనీలు, గోపాలపురంతో పాటు వివిధ కాలనీలోని మహిళలు అధిక సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు నైవేద్యం, ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అలయ కమిటీ చైర్మన్ సునీల్‌కుమార్, సభ్యులు వెంకటనారాయణ, సుధాకర్, నటరాజ్, రాజేందర్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

ధనలక్ష్మిగా దర్శనమిచ్చిన శ్రీలలితాదేవి
ఖిలావరంగల్: శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా శివనగర్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం పండుగ శోభను సంతరించుకుంది. వరాలిచ్చే చల్లని తల్లి వరక్ష్మి దేవి అనుగ్రహం కోసం మహిళలు అత్యంత వైభవంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. వ్రతం సందర్భంగా మహిళలందరూ సాంప్రదాయబద్ధంగా ముస్తాబైన అమ్మవారిని పూజించారు. శక్తి మేర వివిధ రకాల నైవేధ్యాలను వరలక్ష్మిదేవికి సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ లలితాదేవిని రూ.10లక్షలు నగదుతో సర్వాంగా సుందరంగా అలంకరించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ లలితాదేవి భక్తులకు వరలక్ష్మి దర్శనమిచ్చింది. అర్చకుడు శివరామకృష్ణ వ్రతం అనంతరం అమ్మవారికి మహా హారతినిచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు అందచేశారు. అలాగే భక్తులకు ఆలయ కమిటీ మహా అన్నదాన ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు అధ్యక్షుడు వొడ్నాల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మంచాల కృష్ణమూర్తి, కోశాధికారి చింతం యాదగిరి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీరాం రాజేశ్, బత్తుల నవీన్‌కుమార్, ఆడెపు దశరథం, కొండి రాజమౌళి, బండి నరేందర్, జోగు వెంకటేశ్వర్లు, చిక్క మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...