ఏఐడీఎస్‌వో మహాసభల ర్యాలీ


Sat,August 24, 2019 03:16 AM

రెడ్డికాలనీ, ఆగస్టు 23: ఏఐడీఎస్‌వో జిల్లా మహాసభల సందర్భంగా శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మకొండ శ్రీరాజరాజనరేంద్రాంధ్ర భాషా నిలయంలో జరిగిన మహాసభలో ముఖ్యఅతిథులుగా ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర నాయకులు కే భరతేశ్, ఏఐడీఎస్‌వో రాష్ట్ర కార్యదర్శి ఆర్ గంగాధర్ పాల్గొన్నారు. అనంతరం సంఘం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎల్ సాయికుమార్, ఉపాధ్యక్షులుగా అన్సారీ, నితిన్, ఎస్ సాయికుమార్, కార్యదర్శిగా జే వినోద్, సహాయ కార్యదర్శిగా బీ అనీశ్, హరి, కోశాధికారిగా రాజ్‌కుమార్, నర్మద, భవానీ, మేఘన, కీర్తిచందన, 39 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...