వైభవంగా తీజ్ పండుగ


Fri,August 23, 2019 03:42 AM

-పలు గ్రామాల్లో వేడుకలు
-ఆడిపాడిన యువతులు, మహిళలు
-పాల్గొన్న ఎమ్మెల్యేలు అరూరి, తాటికొండ, వొడితల, జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్

భీమారం, ఆగస్టు 22: గిరిజన లంబాడీల సంస్కృతి సంప్రదాయలకు ప్రతీకే తీజ్ పండుగ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ పరిధిలోని 46వ డివిజన్ గోపాలపురంలో గురువారం రాత్రి వైభవంగా తీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనులు ప్రకృతిని ఆరాధిస్తారన్నారు. తీజ్ నవరాత్రి ఉత్సవాల్లో యుక్త వయస్సు అమ్మాయిలు నిష్టతో భక్తి శ్రద్ధలతో తీజ్‌కు పూజలు చేస్తారన్నారు. లంబాడీ ల కోసం ప్రత్యేకంగా రూ. 10 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఒకే రోజు తీజ్ పండుగను జరుపుకునేందుకు ప్రభుత్వానికి తెలియపరుస్తాన్నారు. కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ లంబాడీ సోదరిసోదరులకు తీజ్ శుభాకాంక్షలు తెలిపారు. కార్పోరేటర్ సిరంగి సునీల్‌కుమార్ మాట్లాడుతూ తీజ్ పండుగను లంబాడీ మహిళలు అనందంగా, గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గోపాలపురం బాలాజీ కాలనీ నుంచి ఆట-పాటలతో విన్యాసాలు, నృత్యాలు చేస్తు , డీజే పాటలతో ఊరేగింపుగా కాకతీయ యూనివర్సిటీ 100 ఫీట్లు రోడ్డు వరకు చేరుకున్నారు. అక్కడి నుంచి తీజ్‌ను పట్టుకొని వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో 46వ డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షులు బైరి వెంకట్రాజం, టీఆర్‌ఎస్ నాయకులు చింత రమేశ్, దూలం రాజు, లోకిని చం దర్, సంత్ సేవాలాల్ తీజ్ కమిటీ అధ్యక్షులు వీరన్న నాయక్ ప్రధాన కార్యదర్శి ధారావత్ రాంచందర్ నా యక్, జవహర్‌లాల్,రామెల్‌నాయక్, దాస్యనాయక్, రా జారాం నాయక్, గిరిజన మహిళలు, వివిధ కాలనీల ప్రజలు పాల్గొన్నారు.

భీమదేవరపల్లిలో...
భీమదేవరపల్లి: గిరిజనుల ఆరాధ్యపండుగ తీజ్ ఉత్సవాలు మండలంలోని వీర్లగడ్డతండలో గురువారం ఘనంగా జరిగాయి. వర్షాకాలం ఆరంభంలో శీత్లాభవాని పండుగ అనంతరం తీజ్ ఉత్సవాలు ప్రారంభం అవుతా యి. తొమ్మిది రోజుల పాటు సందడిగా జరుగుతాయి. పెళ్లికాని గిరిజన యు బుట్టల్లో పుట్టమట్టిని పోసి నానబెట్టిన గోధుమలు జల్లుతారు. బుట్టలన్ని ఒక చోట చేర్చి పందిరి ఏర్పాటు చేస్తారు. పందిరిపై బుట్టలన్ని చేర్చి రోజు నీళ్లు పో స్తారు. విత్తనాలు మొలకెత్తితే యువతులకు మంచి భర్త లభిస్తాడని, పాడిపంట లు బాగా పండుతాయని వీరి నమ్మకం..

హాజరైన ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్
వీర్లగడ్డతండలో జరుగుతున్న తీజ్ ఉత్సవాలకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, జెడ్పీచైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్, ఎంపీపీ జక్కుల అనిత, జెడ్పీటీసీ వంగ రవి హాజరయ్యారు. అనంతరం పందిరిపై ఉన్న బుట్టలను ఎమ్మెల్యే , జెడీచైర్మన్ నెత్తిన పెట్టుకోగా తండావాసులు కేరింతలు కొట్టారు. కార్యక్రమంలో వీర్లగడ్డతండ, మల్లారం సర్పంచులు గుగులోతు తుకారం, గూడెల్లి రాజిరెడ్డి, ఎంపీటీసీ గుగులోతు లలిత, ఉపసర్పంచ్ భూక్య కిషన్, టీఆర్‌ఎస్ నాయకులు సంగ సంపత్, మార్పాటి మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్, తిరుమల్‌రెడ్డి, శివ, రాజు, తిరుపతి, తండావాసులు పాల్గొన్నారు.

గిరిజనుల అభివృద్ధి కోసం కృషి
ధర్మసాగర్ : వేలేరు మండలంలోని ఎర్రబెల్లిలో నిర్వహించిన తీజ్ వేడుకల్లో ఎమ్మెల్యేలు డాక్టర్ టి. రాజయ్య, సతీష్‌కుమార్ పాల్గొని మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం మరింతగా కృషి చేస్తామన్నారు. గిరిజనులు నృత్యాలు చేయగా వారితో కలిసి ఎమ్మెల్యేలు నృత్యాలు చేశారు. ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి, సర్పంచ్ బానోతు విజయలక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...