కుష్టు నిర్మూలన సర్వేను పకడ్బందీగా చేయాలి : డీఎంహెచ్‌వో


Fri,August 23, 2019 03:31 AM

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని గ్రామాల్లో పకడ్బందీగా అమలుచేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ చల్లా మధుసూదన్ అన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శా ఖ కార్యాలయంలో వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణ, జాతీయ కుష్టు నిర్మూలన, క్షయ నివారణపై వైద్యాధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ 60 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధుల వారిని 60, 70, 80 సంవత్సరాల వారీగా విభజించి వారి ఆ రోగ్య సమస్యలను గుర్తించి చికిత్స అందించాలన్నారు. అవసరమైన వారికి ఫిజియోథెరపీ చే యిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు ఆశ, ఏఎన్‌ఎంలు ఇం టింటికి తిరుగుతూ సర్వే, క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలన్నారు.

స్పర్శలేని మచ్చలు, రాగివర్ణపు మచ్చలు కలిగి ఉంటే వెంటనే చికిత్స అందించాలన్నారు. రెండు వారాలకు మించి దగ్గు ఉంటే తెమడ పరీక్షలు చేయించాలన్నారు. ఇం టింటీ సర్వేను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రాష్ట్రస్థాయి పరిశీలకులు డాక్టర్ విజయనిర్మల, డిప్యూటీ డీఎంహెచ్‌వో క్రాంతికుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుధీర్, డాక్టర్ కమల్‌చంద్, డాక్టర్ నరసింహారెడ్డి,హెచ్‌ఈ కేవీ రాజు, డీపీఎంవో మధుసూదన్‌రెడ్డి, డీడీఎం నితిన్, వైద్యాధికారులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...