మృతుడి కుటుంబానికి ఆర్థికసాయం


Fri,August 23, 2019 03:26 AM

ఐనవోలు ఆగస్టు 22 : మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్ స్టేషన్‌ల్లో ఆర్టిజన్ గ్రేడ్-2 గా విధులు నిర్వర్తిస్తున్న ఐనవోలుకు చెందిన పోశాల మధు(39) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న టీఆర్‌వీకేఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్ కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 30 వేల ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిజన్ యూనియన్ కార్మికుడిగా మధు చురుకైన పాత్ర పోశించాడని గుర్తు చేశారు. మధు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎన్పీడీసీఎల్ కార్యదర్శి ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ అక్బర్, వరంగల్ రూరల్ సెక్రటరీ రాజ్‌నరేందర్, సిటీ బ్రాంచ్ ప్రెసిడెంటు మధు, కార్యదర్శి కోటేశ్వర్, లక్ష్మీనారాయణ, మోహన్, నర్సింహారావు, ఖాధర్, పుల్లయ్య తదితరులు ఉన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...