డీబీఆర్‌సీ కరపత్రాల ఆవిష్కరణ


Fri,August 23, 2019 03:26 AM

ఎల్కతుర్తి : స్వయం ఉపాధినందు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమ కరపత్రాలను మండలంలోని పలు గ్రామాల్లో దళిత బహుజన రిసోర్స్ సెంటర్(డీబీఆర్‌సీ) ఆధ్వర్యంలో గురువారం ఆవిష్కరించారు. మండలంలోని దామెర, చింతలపల్లి, ఎల్కతుర్తి గ్రామాల్లో డీబీఆర్‌సీ కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం యువతకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణ ద్వారా 16-35 సంవత్సరాల యువతకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. దీనికోసం ఈనెల 23న హసన్‌పర్తి ఎంపీపీ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో డీబీఆర్‌సీ సమన్వయకర్త చుంచు రాజేందర్, కడారి రాజేందర్, రాజు, సోరపాక రాజు, కిరణ్, మహేష్, వేణు, రమేష్, మోహన్ పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...