వ్యాగన్ స్థలాన్ని సందర్శించిన అఖిలపక్షం


Fri,August 23, 2019 03:26 AM

మడికొండ, ఆగస్టు 22: అయోధ్యపురలో రైల్వే వ్యాగన్ షెడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని గురువారం అఖిలపక్షం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాజీపేటకు మంజూరైన వ్యాగన్ వర్క్‌షాపు, పీరియాడికల్ ఓవరాల్ హెడ్‌ను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని చెప్పారు. పరిశ్రమపై స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిశ్రమను నెలకొల్పే వరకు ఉద్యమాలు చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు నార్లగిరి రామలింగం, వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల ఉపేందర్, మనోహర్, శ్రీకాంత్, సాంబయ్య,కుమారస్వామి, సదానందం, శోభారాణి, సుధారాణి, సాయిరాజ్, మహేశ్, రాజ్‌కుమార్, వేను, నవీన్‌కుమార్, స్వామి, రామేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...