ఉప్పల్ హాస్టల్‌లో ఏఎస్‌డబ్ల్యూవో విచారణ


Thu,August 22, 2019 03:08 AM

కమలాపూర్: మండలంలోని ఉప్పల్ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో హసన్‌పర్తి ఏఎస్‌డబ్ల్యూవో నిర్మల బుధవారం విచారణ చేపట్టారు. ఈనెల 20న హాస్టల్ తనిఖీ చేసిన ప్రజాప్రతినిధులు మరుగుదొడ్ల నిర్వహణ, రిజిస్ట్టర్ల మెయింటనెన్స్ సక్రమంగా లేకపోవడంతో వార్డెన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పత్రికల్లో రావడంతో స్పందించిన ఏఎస్‌డబ్ల్యూవో సర్పంచ్ దేవేందర్‌రావు, ఎంపీటీసీ సంపత్‌రావుల సమక్షంలో విచారణ జరిపినట్లు చెప్పారు. పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానని వెల్లడించారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...