జిల్లా ప్రధాన న్యాయమూర్తి తిరుమలాదేవి


Thu,August 22, 2019 03:07 AM

వరంగల్‌లీగల్, ఆగస్టు 21: వృద్ధాప్యంలో తగి న ఆర్థిక స్థోమత ఉండి, ఆదరణ చూపే సంతానం ఉన్నట్లయితే అంతకుమించిన సంతోషంలేదని జి ల్లా ప్రధాన న్యాయమూర్తి ఈద తిరుమలాదేవి పే ర్కొన్నారు. బుధవారం ప్రపంచ వయోవృద్ధుల ది నోత్సవం సందర్భంగా న్యాయసేవా సంస్థ ఏర్పా టు చేసిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వృద్ధులను గౌరవించడమంటే మనల్ని మనం గౌ రవించుకోవడమేనని, ఆ దశలో వారికి ఆసరా కా వడాన్ని అదృష్టంగా భావించాలి తప్పా భారంగా చూడొద్దన్నారు. సరైన ఆదరణ చూపి ఇంట్లోని బాలలకు వారిపట్ల గౌరవ భావాన్ని పెంపొందించినట్లయితే, వృద్ధాశ్రమాల అవసరం సమాజానికి ఉండదని ఆమె పేర్కొన్నారు. సంస్థ కార్యదర్శి, సీ నియర్ సివిల్ జడ్జి విక్రమ్, సీనియర్ సిటిజన్స్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2007 గురించి వివరించారు. ఇంకా ఈ కా ర్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మసూర్ హుస్సేన్, న్యాయ సేవా సంస్థ మెంబర్లు ఆర్ సురేశ్, బొమ్మ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...