భవన నిర్మాణ కార్మికులు అప్రమత్తంగా ఉండాలి


Thu,August 22, 2019 03:06 AM

సిద్ధార్థనగర్, ఆగస్టు21: నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సుగ్న మెటల్స్ సీనియర్ ఎగ్జిక్యూటీవ్ హుస్సేన్ అన్నారు. బుధవారం వడ్డేపల్లి కూడలి వద్ద శ్రీనివాస స్టీల్స్ అండ్ ఐరన్ ఏజెన్సీస్ ఆధ్వర్యంలో సుగ్నమెటల్స్ డీలర్ రమేశ్‌బాబు అధ్యక్షతన నిర్మాణరంగంలో ప్రమాదాల భారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భవన పటిష్టతకు నాణ్యమైన స్టీల్ ఎంపికపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతతూ గృహ నిర్మాణాలు చేస్తున్నప్పుడు ప్రమాదం జరుగకుండా కార్మికులు తప్పనిసరిగా హెల్మెట్, బూట్లు, గ్లౌసెస్ వాడాలని సూచించారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. సదస్సులో సుగ్న సిబ్బంది ధీరజ్ శ్రీవాత్సవ్, మొహమ్మద్‌హుస్సేన్, రోషన్, కార్మికులు, మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...