లాట్ నంబర్ ఉంటేనే కాంటా వేయాలి


Wed,August 21, 2019 03:47 AM

కాశీబుగ్గ, ఆగస్టు 20: మార్కెట్‌కు వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులకు లాట్ నంబర్ ఉంటేనే కాంటా వేసేలా చర్యలు తీసుకోవాలని జేడీఎం మల్లేశం అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ఉద్యోగులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్కెట్‌కు వచ్చే ప్రతీ వ్యవసాయ ఉత్పత్తికి తప్పని సరిగా లాట్ నెంబర్ అలాట్ చేయాలని సూచించారు. అడ్తి వ్యాపారులు ఎలక్ట్రానిక్ కాంటాలకు జీపీఆర్‌ఎస్ చిప్‌లు పెట్టుకునేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. చిప్‌లు లేని కాంటాల్లో తూకం వేయకూడదని హెచ్చరించారు. అలాగే మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్న వెబ్రిడ్జి కాంటాలు సక్రమంగా పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. చిట్టా పుస్తకాలు, తక్ పట్టీలను వెంట వెంటనే తనిఖీ చేయాలని, అడ్తి వ్యాపారుల దగ్గర నుంచి తక్‌పట్టి పుస్తకాలను తీసుకోవాలన్నారు. ఉద్యోగులు తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని , నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో కార్యదర్శి సంగయ్య, సూపర్‌వైజర్లు జన్ను భాస్కర్, కృష్ణమీనన్, భూక్య వెంకన్ననాయక్, లక్ష్మీనారాయణ, శ్రీకాంత్, శ్రీనివాసరాజు, ముడిదే శివకుమార్, కనుకుంట్ల రంజిత్‌కుమార్, నల్ల నర్సింగరావు, కుమారస్వామి పాల్గొన్నారు. అనంతరం చాంబర్ పరిధిలోని అడ్తి సెక్షన్ వ్యాపారులతో జేడీఎం సమావేశమై ఎలక్ట్రానిక్ కాంటాలకు వెంటనే జీపీఆర్‌ఎస్ చిప్‌లు బిగించుకోవాలని సూచించారు. మార్కెటింగ్‌శాఖ కమిషనర్ ఆదేనుసారం వ్యాపారులు తమ సిబ్బందికి సహకరించాలని కోరారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...