పోరాట యోధుడు పాపన్నగౌడ్


Mon,August 19, 2019 03:41 AM

-యువత ఆదర్శంగా తీసుకోవాలి
-ఎంపీ పసునూరి దయాకర్
-ఘనంగా సర్ధార్ జయంతి వేడుకలు
రెడ్డికాలనీ, ఆగస్టు 18: సర్ధ్దార్ సర్వాయి పాపన్నగౌడ్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం సెమినార్ హాల్ లో సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను ని ర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ పసునూరి దయాకర్ పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహిచిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ 350 సంవత్సరాల క్రితం మొగలాయిలపై వీరోచిత పోరాటం చేసి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్న తొలి బహుజన విప్లవవీరుడు సర్ధ్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అన్నారు. మొగులాయి సైన్యం అరాచకాలను ఎదుర్కొనేందుకు తన తోటి ఇతర బహుజన కులాలు, దళితులను కలుపుకొని 12 వేల మంది సైన్యాన్ని తయారు చే సి, వారిపై దండయాత్ర చేశారని గుర్తుచేశారు. 20 కోటలు స్వాధీనం చేసుకుని 20 సంవత్సరాల పాలన కొనసాగించారన్నారు. తెలంగాణ ఉద్యమకారులు పులి సారంగపాణిగౌడ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బహుజనులు రా జ్యాధికారం చేపట్టాలంటే బీసీలు, దళితులు కలిసి ఐక్యంగాఉద్యమించి, ముందుకుసాగాలన్నారు. గౌడ సంఘాల సమన్వయ కమిటీ వరంగల్ జిల్లా కన్వీనర్ చిర్ర రాజ్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొనగాని యాదగిరిగౌడ్, బీసీ సంక్షేమ సం ఘం వరంగల్ జిలా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌గౌ డ్, జనగాని శ్రీనివాస్, మార్క రవి, చిర్ర సుమన్, సోల్తి కిర ణ్, తాళ్లపెల్లి సురేశ్, వల్లాల జగన్, కూనూరు రంజిత్, అం జయ్య, ఇంద్రసేనా, సాయిబాబు, సదానందం, హరీశ్, వెంకటేశ్వర్లు, శేషచలం, గంగాధర్ పాల్గొన్నారు.

కాజీపేటలో..
కాజీపేట: సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను గౌని సాంబయ్యగౌడ్, అమ్మయ్యగౌడ్ అధ్యక్షతన కా జీపేట చౌరస్తాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కా ర్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గౌడ సంఘం రా ష్ట్ర ఉపాధ్యక్షుడు బొనగాని యాదగిరిగౌడ్ హాజరై పాపన్న చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌గౌడ్, తీగల సమ్మయ్యగౌడ్, భరత్‌గౌడ్, నర్సింగ్‌గౌడ్, పల్లగాని శ్రీరాములు, బుర్ర బాబుగౌడ్, శేఖర్‌గౌడ్, కుమారస్వామి, భద్రయ్య, సురేందర్, ధ ర్మగౌడ్, రాజేంద్రప్రసాద్, సదానందం, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.

భీమారంలో..
భీమారం: బహుజనులకు రాజ్యాధికారం కోసం పోరాడిన యోధుడు సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ అని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొనగాని యాదగిరిగౌడ్ అన్నారు. 55వ డివిజన్ చింతగట్టులోని రేణుక ఎల్లమ్మతల్లి ఆలయంలో ఆదివారం సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను నిర్వహించారు. గీతకార్మికులు పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు ఏరుకొండ శ్రీనివాస్‌గౌడ్, గౌడ సం ఘం నాయకులు చింత కరుణాకర్, మోడం సందీప్‌గౌడ్, జనగాని వేణుప్రసాద్, మోడెం సుమన్‌గౌడ్, రాంనాథ్, బత్తిని సారయ్య, మొగిలిగౌడ్, బిక్షపతిగౌడ్, సుధాకర్, శ్రీకాంత్, రవితేజ, రణధీర్, రమేశ్ పాల్గొన్నారు.

ఎర్రగట్టు గుట్ట వద్ద..
సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకులను ఎ ర్రగట్టుగుట్ట గౌడ సంఘం ఆధ్వర్యంలో కిట్స్ క్రాస్ రోడ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బొనగాని యాదగిరిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, భరత్‌గౌడ్, గునిగం టి శ్రీనివాస్‌గౌడ్, గంగాధర్‌గౌడ్, దేవేందర్‌గౌడ్, రాజేశ్‌గౌడ్, తిరుపతిగౌడ్, యుగేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...